International Flight Services: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన గత ఏడాది నుంచి పలు దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఓవైపు సడలింపులతో దాదాపు అన్ని రంగాల్లో పనులు మొదలుకాగా, మరోవైపు కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్19 నేపథ్యంలో ట్రావెల్ మరియు వీసా ఆంక్షలను మరోసారి పొడిగించారు. భారత్ నుంచి విదేశాలకు, విదేశాల నుంచి భారత్‌కుగానీ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. జులై 31 అర్ధరాత్రి 11:59 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 30న ఓ ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయ అన్ని కార్గో విమాన సర్వీసులకు తాజాగా విధించిన ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించినట్లు ప్రకటనలో తెలిపింది. కొన్ని ప్రత్యేక రూట్లు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే అంతర్జాతీయ విమనాల రాకపోకలు (International Flights) కొనసాగుతాయని పేర్కొంది.
Also Read: Gold Price In Hyderabad 30 June 2021: మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు, పసిడి దారిలోనే వెండి పయనం
Restrictions on scheduled international passenger flights to/from India extended till July 31st, 2021: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/tYCv5P80Oi
— ANI (@ANI) June 30, 2021
గత ఏడాది లాక్‌డౌన్ తొలిసారి ప్రకటించిన సమయంలోనే అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఎవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి నెలా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం, వీసా అనుమలపై ఆంక్షలు పొడిగిస్తూ వస్తోంది. గతంలో విధించిన ప్రయాణ ఆంక్షలు జూన్ 30న ముగియనున్న నేపథ్యంలో తాజాగా మరోసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్‌పై ఆంక్షల్ని జులై 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటనలో వివరాలు తెలిపింది.
Also Read: India COVID-19 Cases: ఇండియాలో మరోసారి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook