International Flights: భారత్ నుంచి అంతర్జాతీయ విమానాలపై DGCA నిషేధం పొడిగింపు

International Passenger Flights : కరోనా వైరస్ కేసులు గత ఏడాది భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. ఏప్రిల్ 30తో ముగియనున్న అంతర్జాతీల విమానాలపై నిషేధాన్ని మే 31వరకు డీజీసీఏ పొడిగించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 30, 2021, 06:46 PM IST
  • ఏప్రిల్ 30న ముగియనున్న అంతర్జాతీయ విమానాల నిషేధం
  • ఈ క్రమంలో మే 31 వరకు విమాన సర్వీసులపై డీజీసీఏ ఆంక్షలు పొడిగింపు
  • గత ఏడాది మార్చి 23 నుంచి నేటి వరకు కొనసాగుతున్న నిషేధ ఆంక్షలు
International Flights: భారత్ నుంచి అంతర్జాతీయ విమానాలపై DGCA నిషేధం పొడిగింపు

కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధించారు. ఏప్రిల్ 30తో ముగియనున్న నిషేధం గడువును డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వచ్చే నెల వరకు పొడిగించింది. కొన్ని అధికారిక విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు కల్పించారు. మరోవైపు మే 1 నుంచి భారత్‌లో మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.

కరోనా వైరస్ కేసులు గత ఏడాది భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. అందువల్ల లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది. మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. ఏప్రిల్ 30తో ముగియనున్న అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కరోనా వైరస్(CoronaVirus) వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మే 31వరకు డీజీసీఏ పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: COVID-19 Vaccine Formula: భారత్‌కు కరోనా వ్యాక్సిన్ ఫార్ములా ఇవ్వకూడదన్న Bill Gates

వందే భారత్ మిషన్ కార్యక్రమంతో విదేశాలలో చిక్కుకుపోయిన స్వదేశీయులను లక్షల మందిని భారత్‌కు తిరిగి తీసుకొచ్చారు. కొన్ని పరిమితులతో గత ఏడాది జూలై నుంచి కొన్ని దేశాలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక సర్వీసులు, ఎయిర్ ఇండియా సర్వీసులు కొనసాగించింది. కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా మొత్తం 27 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఏర్పాటు చేసుకుంది. ఇందులోని ఏవైనా రెండు దేశాలు పరస్పర సహకారంతో విమాన సర్వీసులను నడిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కార్గో విమాన సర్వీసులు విదేశాల నుంచి కోవిడ్-19(COVID-19) వ్యాక్సిన్ డోసులను భారత్‌కు తీసుకొస్తున్నాయని తెలిసిందే.

Also Read: Cancer Patientsకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి 

భారత్‌లో నిన్న ఒక్కరోజులో 3,86,452 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వాటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 87 లక్షల 62 వేల 9 వందల 76కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 30,79,308 యాక్టివ్ కేసులున్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరణాల సంఖ్య రెండు లక్షలు దాటింది. ఇండియాలో ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి 2,08,330 మంది మరణించారు. ఫిబ్రవరి చివరి నుంచి నేటి వరకు 7.7 మిలియన్ల కేసులు భారత్‌లో నమోదుకాగా, గతంలో ఈ సంఖ్య చేరుకోవడానికి 6 నెలల సమయం పట్టడం గమనార్హం. 

Also Read: Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌పై మరో ఆసక్తికర విషయం వెల్లడించిన నిపుణులు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News