Russia - Ukarain War: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టలోపు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది.ఇప్పటికే యుద్ధం కారణంగా రెండు దేశాలు భారీగా నష్టపోయినా... ఎవరు తగ్గేదే లేదంటున్నారు. రష్యా కూడా ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.రష్యా తీరుతో ఉక్రెయిన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహాలను రెడీ చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అందజేసిన లాంగ్ రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇవ్వడంతో ఈ యుద్ధం పతాక స్థాయికి చేరుకునేలా ఉంది. తాను దిగిపోయే లోపు రష్యాను వీలైనంతగా కోలుకోలేని దెబ్బ తీయాలని బైడెన్ వ్యూహంగా కనిపిస్తోంది.
జో బైడెన్ అనుమతిపై అమెరికా అధికార వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్‌ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమని తెలిపారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్‌పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా సరఫరా చేసిన క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్‌పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ మాత్రం మారుతున్న పరిస్థితులను గమనిస్తున్నాడు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter