Salmonella outbreak: అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న ఉల్లిపాయ.. సాల్మొనెల్లా వ్యాధి వ్యాప్తి

Salmonella disease : సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వ్యాపిస్తోంది. సాల్మొనెల్లోసిస్ వ్యాప్తికి ఉల్లిపాయలే కారణం అంటూ సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 02:14 PM IST
  • ఉల్లిపాయ తినడంతో అమెరికా ప్రజలకు సాల్మొనెల్లా వ్యాధి
  • 37 రాష్ట్రాలకు వ్యాపించిన వ్యాధి
  • 650 పైగా కేసులు నమోదు
  • ఈ వ్యాధి మరింత విస్తరించి మహామ్మరిగా మారే అవకాశం
Salmonella outbreak: అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న ఉల్లిపాయ.. సాల్మొనెల్లా వ్యాధి వ్యాప్తి

Salmonella outbreak: Over 650 fall ill in US from disease tied to onions : ఉల్లిపాయ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది. ఉల్లిగడ్డ తినడంతో అమెరికా ప్రజలకు సాల్మొనెల్లా (Salmonella) వ్యాధి సోకుతోంది. ఇప్పటికే చాలామంది అమెరికన్లకు ఈ వ్యాధి సోకింది. 37 రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాపించిందని, 650 పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. వైరల్ ఫీవర్స్ (Viral Fever) మాదిరిగానే..ఈ వ్యాధి లక్షణాలుంటాయి. ఎక్కువగా మహిళలే సాల్మొనెల్లా బారిన పడుతున్నారు. ఉల్లిపాయలు (onions) తిన్న ఆరు గంటల్లోనే సాల్మొనెల్లా వ్యాధి సోకుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. 

సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వ్యాపిస్తోంది. సాల్మొనెల్లోసిస్ వ్యాప్తికి ఉల్లిపాయలే కారణం అంటూ సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ (Centers for Disease Control and Prevention) ప్రకటించింది. అమెరికాలో సెప్టెంబర్ లోనే సాల్మొనెల్లా కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సాల్మొనెల్లా వ్యాధి అమెరికాలోని 37 రాష్ట్రాలకు వ్యాపించింది. టెక్సాస్‌లో (Texas‌) అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మేరీల్యాండ్‌లో 58, మిస్సోరీలో 21 కేసులు నమోదయ్యాయని సీడీసీ (CDC) తెలిపింది.

Also Read : Paritala Sunitha: మాది సీమ రక్తమేనని..రక్తం ఉడుకుతోంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యాధి మరింత విస్తరించి మహామ్మరిగా మారే అవకాశం ఉందని సీడీసీ (CDC) హెచ్చరించింది. ఆగస్టు నెలాఖరులో మెక్సికో, చిహువా (Chihuahua) నుంచి అమెరికాలోని ప్రోసోర్స్ (ProSource) అనే సంస్థ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. వాటిని దేశంలోని పలు రెస్టారెంట్లు, కిరాణా షాపులకు పంపిణీ చేసింది. ఆ ఉల్లిపాయాలను ఇళ్లల్లో, రెస్టారెంట్లలో వినియోగించారు. ఇప్పుడు ఆ ఉల్లిపాయాలే అమెరికాలో సాల్మొనెల్లా (Salmonella) వ్యాధి వ్యాప్తికి కారణమయ్యాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. 

జ్వరం, వాంతులు, డయేరియా, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తే సాల్మొనెల్లా (Salmonella) వ్యాధిగా అనుమానించి తగిన పరీక్షలు చేయించుకోవాలంటూ అమెరికా వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణంతక వ్యాధి కాదని, ఎక్కువ మంది బాధితులు చికిత్స అవసరం లేకుండానే ఒక వారం రోజుల్లోనే కోలుకుంటున్నారని అమెరికా (America) వైద్యులు చెప్పారు.

Also Read : Xiaomi Redmi Note 11 Pro specs: షావోమి నుంచి రెడ్‌మి నోట్ 11 ప్రో సిరీస్ మొబైల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News