Corona health Issues: కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు!

Corona health Issues: కరోనా నుంచి కోలుకున్నా చాలా మందిలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీటిపై బ్రిటన్​కు చెందిన ఓ అధ్యాయనంలో సంచలన విషయాలు బయటికొచ్చాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 02:07 PM IST
  • కరోనా నుంచి కోలుకున్నా వీడని ఆరోగ్య సమస్యలు
  • ప్రత్యేక పరీక్షల ద్వారానే వెలుగులోకి..
  • ఆందోళన కలిగిస్తున్న పరిశోధనలు
Corona health Issues: కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు!

Corona health Issues: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గత రెండేళ్లుగా పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మహమ్మారి బారినపడుతున్నారు. లక్షలాది మంది కొవిడ్​ కారణంగా మృత్యవాత పడుతున్నారు.

అయితే కరోనా సోకిన చాలా మంది కోలుకుంటున్నప్పటికీ.. కొంత మందిలో మహమ్మారి ప్రభావం ధీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. హమ్మయ్యా.. ఎలాగో మహమ్మారిని జయించాం అని అనుకునే లోపే.. చాలా మందిలో దాని వల్ల కలిగిన లోపాలు బయటపడుతున్నాయి.

తాజాగా ఓ అధ్యాయనం కూడా ఇలాంటి విషయాన్ని బయట పెట్టింది. కొవిడ్ నుంచి కోలుకున్నాక కొంత మందిలో శ్వాశ సంబంధి ఇబ్బందులు, ఊపిరి తిత్తుల సమస్యలు కనిపించినట్లు తెలిపింది. బ్రిటన్​కు చెందిన ఎన్​హెచ్ఎస్​ ఫౌండేషన్ ట్రస్ట్​ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

పరిశోధకులు ఏం చెప్పారంటే..

కరోనా నుంచి కోలుకున్న వారిలో గుర్తించిన కొన్ని సమస్యల ఆధారంగా.. కరోనా వైరస్​ అంతర్గత అవయవాలకు నష్టం కలిగిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అయితే చాలా మందిలో ఇలాంటి సమస్యలు ఉన్నా సాధారణ పరీక్షల్లో మాత్రం ఇవి బయటపడటం లేదని వివరించారు పరిశోధకలు. ఇలాంటి సమస్యలకు కొవిడ్ సోకినప్పుడు వచ్చిన మార్పలే కారణమా? అనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పరిశోధకలు అంటున్నారు. ఈ విషయం కనుగొనేందుకు ఇంకా అధ్యాయనం సాగుతున్నట్లు వివరించారు.

వారిలోనూ సమస్యలు గుర్తింపు..

అత్యంత స్వల్ప లక్షణాలతో కొవిడ్ బారిన పడి త్వరగా కోలుకున్న వారిలో సైతం ఇలాంటి సమస్యలు బయపడినట్లు పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా నిర్వహించే పరీక్షల్లో మాత్రం సమస్యలు బయటపడలేదని చెప్పారు.

ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన దీర్ఘకాలిక సమస్యలను గుర్తించేందుకు సాధారణ సిటీ స్కాన్​ కాకుండా.. జెనాన్​ గ్యాస్​ స్కాన్​ పద్ధతిని ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు.

ఈ పరిశోధనల ఆధారంగా కరోనా నుంచి కోలుకున్నా కొంత మందిలో శ్వాస సంబంధి సమస్యలు తగ్గలేదని గుర్తించినట్లు చెప్పారు. ఈ పరిశోధన పూర్తయితే.. కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన చికిత్స విధానాన్ని కనుగోనేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఫలితంగా దీర్ఘకాలంలో వచ్చే సమస్యలను కూడా తగ్గించొచ్చని చెప్పారు.

Also read: Black Snow in Russia: అయ్యో.. అక్కడ మంచు నల్లగా కురుస్తోందట! ఎందుకో తెలుసా?

Also read: ing Cobra: హ్యాట్సాఫ్ భయ్యో.. కరవడానికి మీదికొస్తున్న భారీ కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో పట్టేశాడు (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News