క్యాలిఫోర్నియాలో కాల్పులు.. 13 మంది మృతి !

క్యాలిఫోర్నియాలో కాల్పులు.. 13 మంది మృతి !

Updated: Nov 8, 2018, 05:33 PM IST
క్యాలిఫోర్నియాలో కాల్పులు.. 13 మంది మృతి !

అమెరికాలో కాల్పుల సంస్కృతికి ఫుల్‌స్టాప్ పడటం లేదు. ఒక ఘటన మరిచిపోక ముందే మరో ఘటన వెలుగుచూస్తుండటం అమెరికన్లతోపాటు అక్కడ బతుకుదెరువు కోసం వెళ్లిన విదేశీయులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి క్యాలిఫోర్నియాలోని ఓ పబ్‌లో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 13 మంది దుర్మరణంపాలైనట్టు వెంచురా కౌంటీ పోలీసులు తెలిపారు. ది అసోసియెడ్ ప్రెస్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం దక్షిణ క్యాలిఫోర్నియాలోని పబ్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతం కూడా కావడంతో క్యాలిఫోర్నియాలో కాల్పుల ఘటన ఎన్నారై కుటుంబాలకు చెందిన తెలుగు వారిని సైతం కలవరానికి గురిచేస్తోంది.