సింగపూర్ ప్రజలకు ప్రభుత్వం బోనస్..!

కంపెనీలు  లాభాల బాటలో నడుస్తుంటే.. కొంత సొమ్మును కార్మికులకు, సిబ్బందికి బోనస్‌గా ఇస్తుంటాయి. ఇది సర్వసాధారణం. అయితే ఈ విధానాన్ని ప్రభుత్వాలు పాటిస్తే.. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ...!

Last Updated : Feb 20, 2018, 09:31 AM IST
సింగపూర్ ప్రజలకు ప్రభుత్వం బోనస్..!

కంపెనీలు లాభాల బాటలో నడుస్తుంటే.. కొంత సొమ్మును కార్మికులకు, సిబ్బందికి బోనస్‌గా ఇస్తుంటాయి. ఇది సర్వసాధారణం. అయితే ఈ విధానాన్ని ప్రభుత్వాలు పాటిస్తే.. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ...!

సింగపూర్ ప్రభుత్వం ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. తమ మిగులు బడ్జెట్‌ను ప్రజలకు పంచడానికి సిద్ధమవుతోంది. గతేడాది సింగపూర్ ప్రభుత్వానికి 7.60 బిలియన్ల డాలర్ల మిగులు బడ్జెట్ వచ్చింది. ఈ డబ్బును తమ దేశ పౌరులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ఆర్థికమంత్రి హెంగ్ స్వీ కీట్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. మిగులు బడ్జెట్‌ నుంచి 21 ఏళ్లు దాటిన పౌరుల అకౌంట్‌లో 300 సింగపూర్ డాలర్లు ( భారతీయ కరెన్సీలో 14వేలకు పైమాటే) వేస్తామన్నారు. అయితే ఆదాయాన్ని బట్టి దీనిలో విభజన ఉందన్నారు. 28వేల ఆదాయం ఉన్నవాళ్లకు 300 సింగపూర్ డాలర్లు, 28వేల నుంచి లక్ష ఆదాయం ఉన్నవారికి 200 సింగపూర్ డాలర్లు, లక్ష పైన ఉన్నవారికి 100 సింగపూర్ డాలర్లు వేయనున్నట్టు తెలిపారు. ప్రజలకు ఇవ్వగా మిగిలిన వాటిని రైల్వే అభివృద్ధికి వినియోగిస్తామన్నారు.

Trending News