శ్రీదేవి భౌతికకాయం తరలింపులో మరింత ఆలస్యం..

బాలీవుడ్ నటి శ్రీదేవి శనివారం రాత్రి 11 గంటలకు దుబాయ్ లోని జుమేరియా ఎమిరేట్స్ టవర్స్ లోని తన హోటల్ గదిలో మరణించారని దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ధృవీకరించింది. 

Last Updated : Feb 26, 2018, 10:57 AM IST
శ్రీదేవి భౌతికకాయం తరలింపులో మరింత ఆలస్యం..

బాలీవుడ్ నటి శ్రీదేవి శనివారం రాత్రి 11 గంటలకు దుబాయ్ లోని జుమేరియా ఎమిరేట్స్ టవర్స్ లోని తన హోటల్ గదిలో మరణించారని దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ధృవీకరించింది. బాత్రూమ్ లో ఆమె కళ్లుతిరిగి పడిపోయారని, వెంటనే దుబాయ్ లోని రషీద్ హాస్పిటల్ కు తరలించారని స్థానికంగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు హోటల్ యాజమాన్యం నిరాకరించింది. భారతీయ కాన్సులేట్ ఆధారాల ప్రకారం, శ్రీదేవి(54)ని ఆసుపత్రి తీసుకొచ్చాక చనిపోయారు.  

శ్రీదేవి పార్థివదేహాన్ని ఆదివారం రాత్రికే ముంబయికి తీసుకురావాలని అన్ని ప్రయత్నాలూ జరిగినా శవపరీక్షలో జాప్యం కారణంగా సాధ్యం కాలేదు. దీంతో నేడు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. శ్రీదేవి పార్థివదేహానికి అటాప్సీ(పోస్టుమార్టం వంటిది) నిర్వహించిన దుబాయ్ వైద్యులు నివేదిక ఇచ్చేందుకు మరో 21 గంటల సమయం పడుతుందని చెప్పారట. దీంతో సోంవారం ఉదయం శ్రీదేవి భౌతికకాయాన్ని వారు కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ కారణంతో సోమవారం సాయంత్రానికి ఆమె పార్థివదేహం ముంబైకి రానుంది. రాత్రి పొద్దుపోయేవరకు దుబాయ్‌ పోలీసుల తుది నివేదికలు సిద్ధం కాలేదు. కాగా ప్రాథమిక రోపోర్టు ప్రకారం శ్రీదేవికి గుండెపోటు రాలేదని దుబాయ్ స్థానిక పత్రిక ఒకటి తన కథనంలో పేర్కొంది.

ముంబైకి భౌతిక కాయం చేరుకోవడానికి ఇవన్నీ పూర్తిచేసుకోవాలి

- ఒకసారి ఫోరెన్సిక్ నివేదికలు అప్పగించాక, శరీరానికి ఎంబామింగ్ కొరకు ముహైసానాకు తీసుకువెళతారు. ఈ ప్రక్రియ 90 నిమిషాలు పడుతుంది.

- పోలీస్ ఒక డెత్ సర్టిఫికేట్ జారీ చేయాలి

-  భారత కాన్సులేట్ పాస్ పోర్టు రద్దు చేయాలి

- ఇమిగ్రేషన్ డిపార్టుమెంటు అడ్మినిస్ట్రేటివ్  విధానాలను పూర్తిచేయాలి

- పబ్లిక్ ప్రాసిక్యూటర్  పార్థివదేహాన్ని అందచేయడానికి అనుమతి ఇవ్వాలి

- పార్థివదేహాన్ని భారతదేశానికి  ప్రైవేట్ విమానంలో తీసుకెళ్ళాలి

Trending News