సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు ఈ మధ్య వైరల్‌గా మారుతున్నాయి. కొత్త కొత్త వీడియో గేమ్‌లే కాకుండా .. టిక్ టాక్ లాంటి వాటిల్లో వెల్లువెత్తున్న ఛాలెంజ్‌లు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా యువత వీటికి ఇట్టే ఆకర్షితులైపోతున్నారు. ఫలితంగా తెలిసీ తెలియని వయసులో ఛాలెంజ్‌ల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తాజాగా మరో ఛాలెంజ్ వైరల్‌గా మారింది. ఈ ఆట పేరు 'స్కల్ బ్రేకర్ ఛాలెంజ్'. ఆ ఛాలెంజ్ పేరులోనే తెలుస్తుంది.. ఇది ప్రాణాల మీదకు తెచ్చే ఆట అని. ఇప్పుడు ఈ ఆట ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. స్కూలు పిల్లలు, యువకులు ఈ ఆటకు ఆకర్షితులై సరదాగా మొదలు పెడుతున్నారు. కానీ .. ఇది ప్రాణాల మీదకు తెస్తోంది.
'స్కల్ బ్రేకర్ ఛాలెంజ్' ఆటలో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. అందరూ ఒకేసారి పైకి ఎగరాలి. ఐతే ఇరు పక్కల ఉన్న వారు .. మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఎగిరిన సమయంలో వాళ్లు ఎగరకుండా.. చెరో కాలితో .. మధ్యలో ఉన్న వ్యక్తి కాళ్లను ముందుకు తంతారు. దీంతో అతడు వెల్లకిలా పడిపోతాడు. ఫలితంగా భారం అంతా నడుం, వెన్నుపూస, తలపై పడుతుంది. ఇది ప్రాణాంతకం. వెన్నెముక దెబ్బతిన్నా.. తలకు గట్టిగా దెబ్బ తగిలినా .. మనిషి లేవ లేడని వైద్యులు చెబుతున్నారు.
స్కూళ్లలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ గేమ్‌తో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎవరు మొదలు పెట్టినా .. వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సరదాగా కూడా ఈ గేమ్ ఆడవద్దని పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..