విమాన ప్రయాణికులు నియమాలు పాటించడం అత్యంత ప్రధానం. దాని వల్ల అన్ని విషయాలు సవ్యవగా జరుగుతాయి. కానీ అలా చేయకపోతే మాత్రం ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రయాణికులు తమ సీట్లో కూర్చొని ప్రయాణం అయ్యాక విమానం దిగి వెళ్లిపోవడం మాత్రమే చేయాలి. కానీ అలా చేయకుండా తను అందగత్తెను అని తను ఏం చేసినా నడుస్తుంది అనుకుని విమానం రెక్కలపై ఎక్కింది ఒక చక్కని చుక్క. దాంతో తను చేసిన తప్పునకు తగిన మూల్యం చెల్లించుకుంది.
ఉక్రెయిన్ ( Ukraine ) ఇంటర్నేషనల్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 737 విమానం టర్కీ (Turkey ) నుంచి అప్పుడే కీవ్ లోని బోరిస్పిల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటికి వచ్చిన ఆ ముద్దుగుమ్మ తిన్నగా ఎడమ రెక్కలపైకి వెళ్లింది. తిన్నగా వెళ్లి గోవా బీచులో (Goa ) కూర్చున్నట్టు కూర్చుంది.
అది చూసిన సిబ్బంది అమెను మళ్లీ విమానం ఎక్కమన్నారు. ఆమె అలాగే చేసింది. కానీ ఆమె చేసింది మాత్రం అధికారులు అస్సలు నచ్చలేదు. రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గాను అమెను బ్లాక్ లిస్ట్ లో చేర్చారు. ఇలా ఎందుకు చేశావు అని అడిగితే వేడికోసం అలా చేశాను అని చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారట.