శరణార్థులపై నిషేధం విధించిన అమెరికా!!

తీవ్రవాదులు, నేరగాళ్లను చెక్ పెట్టేందుకు.. అమెరికా శరణార్థుల నేపథ్యం, వ్యక్తిగత వివరాలపై అణువణువూ తనిఖీ చేస్తోంది. 

Last Updated : Jan 30, 2018, 04:31 PM IST
శరణార్థులపై నిషేధం విధించిన అమెరికా!!

అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. 11 దేశాలపై నిషేధం ప్రకటించి..ఆ దేశాలను 'అత్యంత ప్రమాదకరం'గా అభివర్ణించిన ట్రంప్ మరోసారి ఆ దేశాలపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ దేశాల నుంచి శరణార్థులు కూడా రాకూడని నిషేధం విధించింది అమెరికా సర్కార్. నిషేధం ఎత్తివేసినప్పటికీ ఆ దేశాల నుంచి ప్రజలు ఎవరైనా వస్తే.. కట్టుదిట్టమైన తనిఖీలు తప్పవని హెచ్చరించింది. ఈ తనిఖీలు గతంలో కంటే మరింత తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. 

తీవ్రవాదులు, నేరగాళ్లను చెక్ పెట్టేందుకు.. అమెరికా శరణార్థుల నేపథ్యం, వ్యక్తిగత వివరాలపై అణువణువూ తనిఖీ చేస్తోంది. ఇందుకోసం సరికొత్త తనిఖీ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఉంది ట్రంప్ ప్రభుత్వం. అమెరికాలో ప్రవేశంపై నిషేధం ఎదుర్కొంటున్న 11 దేశాలపై.. 90 రోజులపాటు పరిస్థితిని సమీక్షించాలని ట్రంప్ సర్కార్ గత సంవత్సరం అక్టోబర్ లో నిర్ణయించిన సంగతి తెలిసిందే..!!

Trending News