Video: సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వీడియో వైరల్..

Joe Biden Falls off Cycle: సైకిల్ రైడ్‌కి బయలుదేరిన జో బైడెన్ మార్గమధ్యలో ఒక్కసారిగా కిందపడిపోయారు. బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన ఒక పక్కకు పడిపోయారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2022, 10:42 AM IST
  • సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన జో బైడెన్
  • గాయాలేమీ కాలేదని వెల్లడి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
 Video: సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వీడియో వైరల్..

Joe Biden Falls off Cycle: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోయారు. ఈ ఘటనలో బైడెన్‌కి ఎటువంటి గాయాలవలేదు. బైడెన్ కిందపడిన వెంటనే.. అక్కడున్నవారు పైకి లేపారు. తాను బాగానే ఉన్నానని బైడెన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అధ్యక్షుడు బైడెన్ ప్రస్తుతం తన సొంత రాష్ట్రమైన డెలావర్‌లో ఉన్నారు. అక్కడి రెహాబోత్‌లోని తన బీచ్ హోమ్ నుంచి శనివారం (జూన్ 17) తన భార్య, అమెరికా ప్రథమ మహిళ అయిన జిల్ బిడెన్, మరికొందరితో కలిసి సైకిల్ రైడ్ చేశారు. ఈ క్రమంలో ఓచోట రోడ్డు పక్కన ఉన్న కొందరు మీడియా రిపోర్టర్స్, స్థానికులతో మాట్లాడేందుకు బైడెన్ సైకిల్ ఆపారు. ఆ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయిన బైడెన్ ఒక్కసారిగా కిందపడిపోయారు.

బైడెన్ కిందపడిపోవడంతో అక్కడున్నవారు ఆందోళన చెందారు. వెంటనే ఆయన్ను పైకి లేపగా.. తనకేమీ అవలేదని.. బాగానే ఉన్నానని బైడెన్ తెలిపారు. బ్యాలెన్స్ కోల్పోవడం వల్లే పడిపోయినట్లు చెప్పారు. బైడెన్ కిందపడిన వార్త వైరల్ అవడంతో వైట్ హౌస్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. బైడెన్‌కి ఏమీ కాలేదని.. వైద్య సహాయమేమీ అవసరం పడలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, బైడెన్ తన 45వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యామిలీతో కలిసి డెలావర్ వెళ్లారు. శుక్రవారం మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో అక్కడే గడపనున్నారు. 

Also Read: Fathers Day 2022: ఇవాళ ఫాదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది, దీని ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా

Also Read: Shani Vakri 2022: తిరోగమన శని కదలిక.. ఈ రాశులవారిని కోటీశ్వరులను చేస్తోంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News