Kadiri School news: శ్రీసత్యసాయి జిల్లాలో మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కదిరి వీవర్స్ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో (Kadiri School) శుక్రవారం జరిగింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 148 మంది విద్యార్థులు చదువుతున్నారు. శుక్రవారం పాఠశాలకు 121 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు.
నిన్న స్కూల్లో వండిన భోజనం మాడిపోవడం గమనించిన విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు లావణ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె భోజనం తిరిగి వండాలని భోజన ఏజెన్సీ నిర్వాకులకు సూచించారు. దాంతో వారు భోజనం ఉడక్క ముందే దించేంసి పిల్లలకు వడ్డించారు. ఇందులో 25 మంది విద్యార్థులు తిన్న వెంటనే వాంతులు, కడుపునొప్పితో బాధఫడ్డారు. వారిని స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం స్టూడెంట్స్ అందరూ కోలుకుంటున్నారు.
ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను జిల్లా వైద్యాధికారి ఎస్వీ కృష్ణారెడ్డి పరామర్శించారు. ఆహార పదార్థాల నాణ్యత వంటి కారణాలతో పిల్లలు అస్వస్థతకు గురై ఉండొచ్చని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, ఇతర పార్టీ నాయకులు విద్యార్థులను పరామర్శించారు.
Also Read: AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook