Blast in Vizag Steel Plant: విశాఖ స్టీల్ ఫ్లాంట్ లో పేలుడు సంభవించింది. ఉక్కు కర్మగారంలోని ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ బ్లాస్ట్ అవ్వడంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో డీజీఎం, ఇద్దరు పర్మిమెంట్ ఉద్యోగులు, ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. క్షతగాత్రులను మెుదట ఫ్యాక్టరీలోని జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన ట్రీట్ మెంట్ కోసం విశాఖలోని ప్రవైట్ ఆస్పత్రికి తరలించారు.
గతంలోనూ..
విశాఖ ఉక్కు కర్మాగారంలో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2022 నవంబరు నెలలో రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.50 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. 2021 డిసెంబరు నెలలో ద్రవఉక్కు నేలపాలై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కూడా భారీ ఆస్తినష్టం వాటిల్లింది. 2012లో జరిగిన అగ్నిప్రమాదంలో అయితే ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాకినాడలో కూడా ఇలాంటి ఘటనే..
రీసెంట్ గా కాకినాడలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పెద్దాపురం మండలంలోని ఓ ఆయిల్ ఫ్యాకింగ్ మిలుల్లో 24 అడుగుల ట్యాంకును శుభ్రం చేసే క్రమంలో ఏడుగురు వర్కర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల వీరంతా చనిపోయారు.
Also Read: Syria earthquake: కన్నీళ్లు పెట్టిస్తున్న సిరియన్ బాలిక ఫోటో.. రక్త సంబంధం అంటే ఇదేనేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి