Ireland to Srikakulam: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఐర్లాండ్ నుంచి శ్రీకాకుళం వచ్చిన ఆ వ్యక్తికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అనేది తేలాల్సి ఉంది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రతిచోటా వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా సంక్రమిస్తూ అప్పుడే 46 దేశాల్లో ఉనికి చాటుతోంది. తాజాగా ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. దేశంలో అప్పుడే 25 వరకూ ఒమిక్రాన్ కేసులున్నట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ, కర్ణాటకలో సైతం ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో అప్రమత్తమైన ఏపీకు ఇప్పుడు అంతర్గతంగానే ఆందోళన ప్రారంభమైంది.
ఎందుకంటే ఐర్లాండ్ నుంచి ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. అయితే ఆయనకు సోకింది సాధారణ కరోనా వేరియంటా లేకా ఒమిక్రాన్ వేరియంటా అనేది ఇంకా తేలాల్సి ఉంది.వెంటనే అప్రమత్తమైన అధికారులు శాంపిల్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ అనంతరం తుది నిర్ధారణ జరుగుతుంది.
ఇటీవలే ఈ వ్యక్తి ఐర్లాండ్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో(Mumbai Airport)దిగాడు. అక్కడ పరీక్షలు చేయించుకోకుండా నేరుగా తిరుమల దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత ఎస్ కోటలోని అత్తారింటికి వచ్చాడు. ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారుల్ని సమాచారం అందడంతో విజయనగరం వైద్య ఆరోగ్యశాఖ నుంచి సిబ్బంది ఆ వ్యక్తితో పాటు భార్య, అత్తల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. హోం క్వారంటైన్‌లో(Home Quarantine)ఉండాలని వైద్య సిబ్బంది సూచించినా..పట్టించుకోకుండా వేపాడ మండలంలోని సొంతింటికి వెళ్లాడు. అలా ఊర్లు తిరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) అయి ఉంటే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే అతన్నించి ప్రైమరీ, సెకండరీ, థర్డ్ కాంటాక్ట్స్ వరకూ చాలా దూరం ఛైన్ సంక్రమించింది.
Also read; AP Corona cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు- రికవరీల్లో భారీ వృద్ధి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook