Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు మూడు రోజులు వర్షాలు తప్పేట్టు లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మోస్తరు వర్ష సూచన పొంచి ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్ తీరంలో ఏర్పడిన ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, వాయవ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైంది. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి నైరుతి దిశగా కొనసాగుతోంది. ఫలితంగా రానున్న 2-3 రోజులు హైదరాబాద్ సహా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా రాత్రి వేళ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. పగటి పూట వాతావరణం మేఘావృతమై చల్లగా ఉంటూ రాత్రి వేళ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రానున్న మూడు రోజులు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు.
అటు హైదరాబాద్ నగరంలో ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలుండవచ్చు. ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో వీచే అవకాశాలున్నాయి. 10-12 కిలోమీటర్ల వేగంతో నగరంలో గాలులు వీస్తాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ లో రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చు. ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉరుములు మెరుపులతో బలమైన గాలులు వీస్తాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరో మూడు రోజులు వాతావరణం ముసురు పట్టి ఉంటుంది. కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.అటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఇదే ఆయన ప్రొఫైల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook