AP Bird Flu: ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ, చికెన్ తినాలంటే జనంలో భయం

AP Bird Flu: ఏపీలో ఇప్పుడు చికెన్ తినాలంటే భయమేస్తోంది. చాలా ప్రాంతాల్లో చికెన్ తినడం మానేశారు. రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే వార్తల నేపధ్యంలో ఆందోళన నెలకొంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ వార్తలపై ప్రభుత్వం స్పందించింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2024, 12:29 PM IST
AP Bird Flu: ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ,  చికెన్ తినాలంటే జనంలో భయం

AP Bird Flu: ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా కోల్లు మృత్యువాత పడటంతో ఆందోళన మరింతగా పెరిగింది. ఇతర జిల్లాలపై కూడా ఆ ప్రభావం కన్పిస్తోంది. చికెన్ తినాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. నెల్లూరు జిల్లాలోని చాటగొట్ల, కోవూరు మండలంలోని ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు పంపించింది ప్రభుత్వం. ఈ పరీక్షల్లో చనిపోయిన ఆ కోళ్లకు ఇన్‌ఫ్లూయెంజా లేదా ఏవియన్ ఫ్లూ ఉందని తేలింది. అంటే బర్డ్ ఫ్లూ అనుమానాలు నిజమయ్యాయి. దాంతో ఈ కోళ్లను శాస్త్రీయ పద్ధతుల్లో ఖననం చేసి ఆ గ్రామాలకు కిలోమీటర్ దూరంలో ఇన్‌ఫెక్టెడ్ జోన్‌గా ప్రకటించింది. అంతేకాకుండా ఆ గ్రామాలకు 10 కిలోమీటర్ల దూరం వరకూ సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకల్ని నియంత్రించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అయితే ఈ ప్రభావం రాష్ట్రంలోని ఇతర జిల్లాలపై పడింది. కోళ్ల పెంపకాలు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి, కృష్ణా, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా కోళ్ల మరణాలు గానీ, ఇన్‌ఫ్లుయెంజా గానీ లేదని పశు సంవర్ధక శాఖ తెలిపింది. అయినా ప్రజల్లో భయం నెలకొనడంతో కోళ్ల అమ్మకాలపై ప్రభావం పడుతోంది. చాలా ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 

కోళ్ల పెంపకం రైతులు ఏమైనా సందేహాలుంటే సంప్రదించాలని కోరుతూ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 1962 ఏర్పాటు చేసింది.

Also read: AP Politics: బీజేపీతో పొత్తు ఖాయమేనా, టీడీపీ-జనసేన-బీజేపీల్లో ఎవరికెన్ని సీట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News