Ap Cm Chandrababu naidu dance video with tribals womens: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎక్కడికెళ్లిన తన మార్కు చూపిస్తుంటారు. ఇటుపాలనలో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. మరోవైపు ప్రజలతో మమేకం అయ్యే అవకాశం దొరికితే, వాళ్లను చక్కగా పలకరిస్తారు. ఇటీవల చేనేత దినోత్సవం నేపథ్యంలో కూడా జరిగిన కార్యక్రమంలో ఏపీ ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం నేపథ్యంలో.. చంద్రబాబు విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహించింది. దీనికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. అక్కడ గిరిజనులతో మమేకమయ్యారు. అంతేకాకుండా.. గిరిజనులు తయారు చేసిన చాయ్ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ను గమనించారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన ముఖ్యమంత్రి.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/XEK06av0c8
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2024
అరకు కాఫీ టీ ఉత్పత్తులను గురించి అడిగి తెలుసుకున్నారు. అరకు కాఫీ టీ తాగారు. ఆదివాసీలతో మాట్లాడి.. వారి సంప్రదాయం నృత్యం థింసా డ్యాన్స్ చేశారు. ఆదివాసీ సంప్రదాయతలపాగ ధరించి, డప్పులు వాయిస్తూ, చంద్రబాబు గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. అంతేకాకుండా.. గిరిజన కళాకారులతో కలిసి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్ పక్కనున్న అధికారులను పిలిచి మరీ వారితో కాఫీ తాగించారు.
ఆదివాసీల జీవనశైలికి సంబంధించిన పనిముట్లతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను.. వాటి వివరాలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అడవి నుంచి వచ్చే కొన్ని రకాల ఉత్పత్తులకు బ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఫుల్ డిమాండ్ ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read more: Venu Swamy : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు.. జాతకం చెప్పేసిన వేణుస్వామి..
గిరిజనులు తయారు చేసే తేనె, ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కూడా చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మంత్రి లోకేష్.. ఎక్స్ వేదికగా అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజనులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అందిస్తామని తెలియజేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter