Chandrababunaidu: చంద్రబాబు 4.0 పాలనకు అప్పుడే నెల రోజులు.. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

Ap Cm Chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఏపీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీనికోసం అధికారులు, నేతలు, ప్రజలు కూడా తమ వంతుగా సహాకారం అందించాలని కూడా బాబు కోరారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 12, 2024, 07:16 AM IST
  • జెట్ స్పీడ్ లో చంద్రబాబు పాలన..
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రజలు..
Chandrababunaidu: చంద్రబాబు 4.0 పాలనకు అప్పుడే నెల రోజులు.. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

Ap cm Chandrababu naidu decisions for ap developments: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. జనసేన, టీడీపీ,బీజేపీకి తమ మద్దతు తెలిపారు. కూటమి కూడా స్ట్రాటజిక్ గా ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా.. ఎన్నికల్లో తమ దైన స్టైల్ లో ప్రచారం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన ఎన్నికలలో ప్రజలు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు. అంతేకాకుండా..  చంద్రబాబు అటూ కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్రను పోషిస్తునే.. కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు.  ఆంధ్ర ప్రదేశ్ గత వైసీపీ హాయాంలో ఎంతగా వెనుకబడిందో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి నేతలు విజయం సాధించారనే చెప్పవచ్చు.

Read more:Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.

ఏపీకి సీఎంగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాన్ డిప్యూటీ సీఎంలు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా చంద్రబాబు పాలన పగ్గాలు చేపట్టి ఈ రోజుతో నెలరోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిశీలిస్తే ఏపీ డెవలప్ మెంట్ కోసం ఎంతగా తపిస్తుందో అర్ధమవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండవరోజే చంద్రబాబు ఐదు సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. పింఛన్ల భారీ పెంపు,పింఛన్ల భారీ పెంపు, వివాదాస్పద లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు, పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణ, రూ. ఐదుకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాల అంచనా కోసం నైపుణ్య గణన నిర్వహణ ఈ ఐదు సంతకాల్లో ఉన్నాయి. తొలి సంతకాలపై ఇచ్చిన హామీలు రెండే! కానీ, ఒకేసారి ఐదు నిర్ణయాలు వెంటనే తీసుకొని సంచలనం కలిగించారు.

పోలవరం, అమరావతి, ఉచిత ఇసుక వంటి విషయాల్లో చంద్రబాబు నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచాయి. కేంద్రంతో సత్సంబంధాలను కల్గి ఉండటం వల్ల.. ఏపీకి  ప్రయోజనం కలిగేలా అనేక నిర్ణయాలను తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్నిరంగాల్లో కుదేలైన ఏపీని తిరికి పూర్వవైభవం తెప్పించడానికి , రాజకీయ నేతలు, ప్రజలు, అధికారులు ముందుకు రావాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడ కూడా ఆర్బాటాలు ప్రచారం లేకుండా.. కేవలం పాలనపై ప్రస్తుతం ఏపీ తమ టార్గెట్ ఉంచిందని చెప్పుకోవచ్చు. ఏపీ ఖజానాలో అప్పులు మాత్రమే ఉన్నాయని..చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి నెలకొందని చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కూడా తన క్యాంపు కార్యాలయం, అసెంబ్లీ సమావేశాలకు హజరైనందుకు అధికారులు..  ఆయనకు రావాల్సిన బకాయిలు ఇవ్వడానికి వస్తే ... పవన్ వద్దని వారించారు.

తన కార్యాలయంకు కావాల్సిన ఫర్నీచర్ తన సొంత డబ్బులతో కొనుగోలు చేస్తానన్నారు. ఇంతటి దీనపరిస్థితిలో ఉన్న కూడా ప్రభుత్వం.. పేదలకు పింఛన్ల విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు. ఎన్నికల్లో ఇచ్చి మాట ప్రకారం... అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పేదలు, దివ్యాంగుల పింఛన్లను భారీగా పెంచారు. పేదల పింఛన్లు రూ.వెయ్యి పెంచడానికి వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు పట్టగా..టీడీపీ ప్రభుత్వం కేవలం పదిహేడు రోజుల్లో హమీని నెరవేర్చింది. రూ. మూడు వేల నుంచి పేదల పింఛన్లను రూ. నాలుగు వేలకు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు రూ. నాలుగు నుంచి రూ. ఆరు వేలకు, పూర్తి అంగ వైకల్యంతో బాధపడుతున్న వారికి ఇచ్చే పింఛన్లు ఒక్కసారిగా రూ. పదిహేను వేలకు పెంచారు. ఈ పెంపును గత మూడు నెలల నుంచి వర్తింప చేస్తూ ఆ మొత్తాన్ని కూడా జూలై నెల పింఛన్లతోపాటుగా కలిపి ఇచ్చారు. ఈ నెల వ్యవధిలో చంద్రబాబా 4.0 సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. 

కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్రతో పాటుగా,  ఏపీ ప్రభుత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి పీఎం మోదీ, అమిత్ షా తో సహా కేంద్రం పెద్దలను ఇన్ వైట్ చేసి అందరితో మంచి స్నేహాపూర్వక సంబంధాలను ఏర్పడటంతో విజయం సాధించారు. కేంద్రం నుంచి, రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనేక పథకాలపై వినతులను ఇచ్చి వచ్చారు.  ముఖ్యంగా పోలవరం, ఏపీకి స్పెషల్ స్టేటస్, అమరావతి రాజధాని ఇలా.. అనేక అంశాలను ఏపీ ప్రభుత్వం పైలేట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో.. అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు భూ సమీకరణతో సహా మొత్తం వ్యయాన్ని భరించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి వ్యయం అయ్యే రూ. వెయ్యి కోట్లు కేంద్రం భరించేలా ఏపీ రాష్ట్రం ఒప్పించగలిగింది. జీఎస్టీ వాటా నిధులు సైతం ఏపీకి భారీగానే వస్తాయనే తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం సహకరించగలదని రాష్ట్రం ఆశిస్తోంది. అంతేకాకుండా.. గత ప్రభుత్వ పాలను ఏయే  రంగాల్లో ఏం నష్టం జరిగిందో కూడా.. శ్వేత పత్రాల రూపంలో టీడీపీ ప్రజల ముందు ఉంచింది.

Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..

ఇప్పటికి మూడు పత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చింది. అమరావతికి డెవలప్ మెంట్, విదేశాల నుంచి కంపెనీలు, పొలవరంకు విదేశీ నిపుణులు, విశాఖ భోగాపూరం ఇలా.. చంద్రబాబు ఏపీని అన్నిరకాలుగా తిరిగి పూర్వవైభం తీసుకొచ్చేలా పాలన అందిస్తున్నారు. అంతేకాకుండా.. పక్క రాష్ట్రంతో పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలపై ఇటీవల ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మరీ మాట్లాడుకున్నారు.రెండు కమిటీల ఏర్పాటుకు కూడా అంగీకారం జరిగింది. దీన్ని బట్టి ఏపీలో చంద్రబాబు 4.0 పాలన జెట్ స్పీడ్ లో కొనసాగుతుందని ఏపీ ప్రజలు సంతోష పడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News