andhra pradesh covid cases : ఏపీలో డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కొవిడ్, భారీగా కరోనా కేసులు

andhra pradesh covid cases : ఆంధ్రప్రదేశ్‌ల కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఏపీలో కొత్తగా 10,057 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 41,713 కొవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. కరోనా వల్ల  విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 05:27 PM IST
  • ఏపీలో డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కరోనా మహమ్మారి
  • పదివేల మార్క్‌ను దాటేసిన రోజువారీ కేసుల సంఖ్య
  • రాష్ట్రంలో కొత్తగా 10,057 కొవిడ్ కేసులు
andhra pradesh covid cases : ఏపీలో డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కొవిడ్, భారీగా కరోనా కేసులు

andhra pradesh covid cases ap records 10,057 fresh covid-19 cases in 24 hours : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ (Covid in Andhra Pradesh) మహమ్మారి డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది. ఏపీలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఏపీలో రోజువారీ కేసుల సంఖ్య పదివేల మార్క్‌ను దాటేసింది. రాష్ట్రంలో కొత్తగా 10,057 మంది (10,057 fresh covid-19 cases) కరోనా బారిన పడ్డారు. 

గడిచిన 24 గంటల్లో 41,713 కొవిడ్ టెస్ట్‌లు (Covid Tests) నిర్వహించగా.. 10,057 మందికి కరోనా (Corona) ఉందని తేలింది. ఇక కరోనా వల్ల నిన్న విశాఖపట్నంలో (Visakhapatnam) ముగ్గురు మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పొయారు. 

కొవిడ్ బారి నుంచి నిన్న 1,222 మంది రికవరీ అయ్యారు. ఏపీలో (ap) ప్రస్తుతం 44,935 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్ వల్ల రాష్ట్రంలో మొత్తం 14, 522 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,19,64,682 శాంపిల్స్ పరీక్షించారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 

 

ఇక అత్యధికంగా వైజాగ్‌లో 1,827, చిత్తూరు జిల్లాలో (Chittoor District) 1,822 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఏపీలో మరోసారి కొవిడ్ విరుచుకపడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొవిడ్ కట్టడికి ఏపీ సర్కార్‌‌ ఇప్పటికే నైట్ కర్ఫ్యూ (Night curfew) కూడా అమలు చేస్తోంది.

Also Read : Parrot Viral Video: ఐఫోన్ రింగ్ టోన్ ను అనుకరించిన అందమైన చిలుక.. వీడియో వైరల్

జిల్లాల వారీగా పరిశీలిస్తే ఏపీలో కొవిడ్ కేసులు ఈ విధంగా ఉన్నాయి.. చిత్తూరులో 1822, అనంతపురంలో (Anantapur) 861, గుంటూరులో 943, కడపలో 482, కృష్ణాలో 332, కర్నూలులో 452, ప్రకాశంలో 716, విశాఖపట్నంలో 1827, విజయనగరంలో 382, తూర్పు గోదావరిలో (East Godavari) 919, పశ్చిమ గోదావరిలో 216, శ్రీకాకుళంలో 407, నెల్లూరులో 698 కొవిడ్ కేసులు (Covid cases) నమోదు అయ్యాయి.

Also Read : Stock Market today: అంతర్జాతీయ ప్రతికూలతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News