కరోనాను కట్టడి చేస్తోన్న ఏపీ.. 2 వేలు దాటిన డిశ్ఛార్జ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కరోనా వైరస్ మహమ్మారి నుంచి త్వరగా రికవరీ అవుతోంది. రాష్ట్రంలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 2000 దాటడం విశేషం. భారీగా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఏపీ ఒకటని తెలిసిందే.

Updated: Jun 2, 2020, 03:10 PM IST
కరోనాను కట్టడి చేస్తోన్న ఏపీ.. 2 వేలు దాటిన డిశ్ఛార్జ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీలో కరోనా రికవరీ కేసులు 2వేలు దాటడం విశేషం. ఏపీలో తాజాగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,874కి చేరుకుంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 60కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో 6గురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ కోడలి అనుమానాస్పద మృతి

ఏపీలో ఇప్పటివరకూ 2037 మంది చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 777 యాక్టీవ్ కేసులున్నాయి. వీరు రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 11,638 శాంపిల్స్ సేకరించి పరీక్షించగా 33 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ  ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  Photos: తెలంగాణలో మహత్తర ఘట్టం

Image Credit: twitter/@ArogyaAndhra

కాగా, ఏపీలో ఉన్నవారిని మినహాయిస్తే.. విదేశాల నుంచి వచ్చినవారిలో 111 మందికి కోవిడ్19 పరీక్షలలో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇవన్నీ యాక్టీవ్ కేసులేనని శుక్రవారం మధ్యాహ్నం బులెటిన్‌లో ఏపీ వైద్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారికి టెస్టులు చేయగా ఇప్పటివరకూ 345 మందికి కోవిడ్19 పాజిటివ్ వచ్చింది. ఇందులో సగానికి పైగా మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 156 మంది చికిత్స పొందుతున్నారు. నేడు 22 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి