Janasena Tamilnadu Politics: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టారా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు. తెలంగాణతో పాటు తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నారా.. అంటే పవన్ కళ్యాణ్
ఆలోచనలు, ఆయన ఆసక్తి చూస్తుంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు సిద్ధులు, సాధువుల పవిత్ర భూమి అని... తన తండ్రి రామకృష్ణ పరమహంస, శారదామాతా, స్వామీ వివేకానందలకు అమితమైన భక్తుడంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఆలోచింప చేస్తోంది.
తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని, తమిళనాడు చరిత్ర తెలుసనే విధంగా పవన్ పోస్టులు పెడుతున్నారని భావిస్తున్నారు. ఇటీవలే సనాతన ధర్మం విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ పాటు ఆయన కుమారుడు..ఉదయనిధి స్టాలిన్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమిళనాడులో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్‌కు సనాతన ధర్మంతో చెక్ పెట్టాలనే వ్యూహంతోనే పవన్ ముందుకు వెళుతున్నారని అంటున్నారు. పవన్ వ్యూహాల వెనుక బీజేపీ పెద్దల మాస్టర్ మైండ్ ఉందనే టాక్ వస్తోంది.
అంతేకాదు రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఛీఫ్ అన్నామలైతో కలిసి ఎన్నికల్లో పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న సినీ నటులెవరు ఈ విధమైన స్టాండ్ తీసుకోలేదు. తీసుకునే ధైర్యం చేయలేదని చెప్పాలి. తమ మతానికి ప్రాధాన్యత ఇస్తే వేరే మతం వాళ్లు నొచ్చుకుంటారనే ఉద్దేశ్యంతో సినీ నటులు ఎవరు పెద్దగా ఈ ఇష్యూపై మాట్లాడరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం .. సనాతన ధర్మ పరిరక్షణ తన కర్తవ్యం అంటూ కార్య రంగంలోకి దిగారు. మరోవైపు ఇతర మతాలకు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే తనే ముందు ఉంటానని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కాకరేపుతోంది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter
Janasena: తమిళనాడులో జనసేన జెండా..! పవన్ స్ట్రాటజీ అదేనా..!