Andhra Pradesh: అమానవీయం.. భార్యకు గుండు గీసి, దిక్కున్న చోట చెప్పుకోమన్న ప్రబుద్దుడు.కారణం ఏంటంటే..?

Family Dispute: భార్య పుట్టింటికి వచ్చి భర్త దారుణంగా ప్రవర్తించాడు. గుండు గీసి, వెంట్రుకలు అందరికి చూపిస్తు దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకొమ్మని బెదిరించాడు.అభిరామ్ అనే యువకుడు మరో యువతితో పెళ్లి చేయడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 2, 2024, 04:00 PM IST
  • - భార్యపై దాడికి పాల్పడిన ప్రబుద్ధుడు..
    - గుండు గీసి నానా బీభత్సం..
Andhra Pradesh: అమానవీయం.. భార్యకు గుండు గీసి, దిక్కున్న చోట చెప్పుకోమన్న ప్రబుద్దుడు.కారణం ఏంటంటే..?

Husband Abuses His Wife: ఆంధ్ర ప్రదేశ్ లో అమానవీయకర ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరిర జిల్లా సీతానగరం మండలం పెదకొండే పూడిలో ఈ దారుణం సంభవించింది. అభిరామ్, ఆశకు కొన్నిరోజుల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో ఆశ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సదరు యువకుడు... భార్య ఇంటికి వెళ్లి నానా బీభత్సం చేశాడు. 

అంతే కాకుండా.. ఆమెకు గుండు గీసి నానారచ్చ చేశాడు. దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకొమ్మని అమానవీయంగా ప్రవర్తించాడు. చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నిస్తే వారిపైన చిందులు తొక్కాడు. అయితే... సదరు అభిరామ్ అనే యువకుడు మరో యువతితో పెళ్లి చేయడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే భార్యను వదిలించుకునేందుకు యువకుడు ఇలా చేశాడని కూడా బాధితురాలు ఆరోపిస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Read Also: Viral news: ''అట్లుంటది మరీ టెక్నాలజీ అంటే..".. ఆన్ లైన్ లో గేదె ను ఆర్డర్ పెట్టిన రైతు.. ట్విస్ట్ ఏంటంటే..?
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News