ఏపీలో పిడుగులు పడే ప్రమాదం వున్న ప్రాంతాలు ఇవే

ఏపీలో పిడుగులు పడే ప్రమాదం వున్న ప్రాంతాలు ఇవే

Last Updated : May 15, 2019, 06:13 PM IST
ఏపీలో పిడుగులు పడే ప్రమాదం వున్న ప్రాంతాలు ఇవే

అమరావతి: ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను పరిశీలిస్తే, ఏపీలో పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని అర్థమవుతున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖపట్టణం, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. జిల్లాల వారీగా పిడుగులు పడే అవకాశం వున్న ప్రాంతాల జాబితా ఇలా వుంది.

ప్రకాశం జిల్లాలోని కుంబం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచెర్ల, కొమరోలుAndhra pradesh govt, Lightning in Andhra pradesh, Rains, RTGSలో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. 
కర్నూలు జిల్లాలో వెలిగండ్ల, బండి ఆత్మకూరు, మహానంది, కొత్తపల్లిలో పిడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. 
చిత్తూరు జిల్లాలో తిరుపతి, శాంతిపురం మండలాలు.
గుంటూరు జిల్లాలో వెల్తుర్థి, దుర్గి. 
విజయనగరం జిల్లాలో పాచిపెంట, రామభధ్రాపురం, సాలూరు మండలాలు  
విశాఖపట్టణం జిల్లాలో నర్సీపట్టణం, గోలుగొండ, రోలుగుంట, జి.కె. వీధి, మాడుగుల, చింతపల్లి, జి.మాడుగుల, అనంతగిరి ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

పిడుగులు పడే ఆస్కారం వున్న పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాల్సిందిగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ విజ్ఞప్తి చేసింది.

Trending News