Mekapati Goutham Reddy Death: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర ప్రజలు, మంత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పార్టీ శ్రేణులు పెను విషాదంలో మునిగిపోయారు.
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడాన్ని రాష్ట్ర ప్రజలు, మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేబినెట్‌లో కీలకమంత్రిగా, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకై అవిరళ కృషి జరుపుతున్న గౌతమ్ రెడ్డికి వివాదరహితుడిగా, మచ్చలేని వ్యక్తిగా పేరుంది. 49 ఏళ్ల గౌతమ్ రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఊహించని పరిణామం.
నిన్న అంటే ఆదివారం దుబాయ్ పర్యటన నుంచి తిరిగొచ్చారు. ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మంత్రి గౌతమ్ రెడ్డికి అత్యవసరంగా చాలా ప్రయత్నాలు చేశారు. అయిదే వైద్యులకు నాడి దొరకలేదని తెలుస్తోంది. చికిత్సకు శరీరం సహకరించలేదని సమాచారం. అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత చివరికి మరణవార్తను అపోలో వైద్యులు ధృవీకరించారు. మంత్రి గౌతమ్ రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్య రెడ్డి, కొడుకు అరజున్ రెడ్డి ఉన్నారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా పనిచేశారు. బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గౌతమ్ రెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో మంచి పట్టుంది.
ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి గౌతమ్ రెడ్డి మరణవార్త అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, వేణుగోపాల కృష్ణ, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని తదితరులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. గౌతమ్ రెడ్డి మరణం అటు పార్టీకు ఇటు ప్రజలకు తీరని లోటని తెలిపారు. గౌతమ్ రెడ్డి మరణం పట్ల టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మచ్చలేకుండా. నిష్పక్షపాతంగా వ్యవహరించిన మంత్రి అని ఆవేదన చెందారు.
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానన్నారు. రాష్ట్ర ఐటీరంగానికి మంత్రి గౌతమ్ రెడ్డి చేసిన సేవలు మర్చిపోలేనివని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మంత్రి గౌతమ్ రెడ్డి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇక రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తదితరులు విచారం వ్యక్తం చేశారు.
Also read: Breaking News: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook