AP: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

Last Updated : Dec 13, 2020, 07:34 PM IST
AP: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య 5 వందలకు పడిపోయింది. మరోవైపు పరీక్షల సామర్ధ్యం పెరుగుతోంది.

ఏపీ ( AP )లో కరోనా వైరస్ ( Corona virus ) దాదాపుగా తగ్గిపోయింది. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో రోజుకు వేలల్లో నమోదువుతున్న కేసులు ఇప్పుడు 5 వందలకు పడిపోయింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 63 వేల 873 కరోనా నిర్ధారణ పరీక్షలు ( Corona test ) నిర్వహించగా కేవలం 506 మందికి పాజిటివ్‌గా నిర్థారణైంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య  8 లక్షల 75 వేల 531 కు చేరుకుంది. కాగా 8 లక్షల 63 వేల 508 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 4 వేల 999 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. 

గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున 5 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1 కోటి 8 లక్షల 30 వేల 990 శాంపిల్స్ పరీక్షించి రికార్డు నెలకొల్పారు. Also read: Tirupati Lok Sabha: తిరుపతి బరిలో బీజేపీనే..జనసేన ప్రచారానికే పరిమితం

Trending News