Heavy Rains: ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై అధికంగా కన్పించింది. అయితే ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చినా ఏపీపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మరో మూడు రోజుల్లో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.
గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇతర ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ట్రోపో ఆవరణం వరకూ విస్తరించి ఉంది. తీవ్ర అల్పపీడనంగా బలపడిన తరువాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడువైపుకు కదులుతోంది. రానున్న 12 గంటల్లో ఇది బలహీనపడనుంది. అయితే డిసెంబర్ 15న అంటే మరో మూడు రోజుల్లో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఫలితంగా డిసెంబర్ 15 నుంచి ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక రానున్న ఈ మూడు రోజులు ఏపీలోని వివిధ జిల్లాల్లో వాతావరణం ఇలా ఉండనుంది. ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపు అంటే డిసెంబర్ 13న ఏపీలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. ఇక ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్ష సూచన ఉంది.
ఇక రేపు ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడితే మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా వాతావరణం ఇలానే ఉండవచ్చు.
Also read: AP Politics: వైసీపీలో ఏం జరుగుతోంది, వరుసగా నేతల రాజీనామాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.