AP Weather Alerts: రాబోయే మూడు రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉండనుందంటే..?

AP Weather Report Alerts: బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.4°C, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.1°C, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో 43°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, 6 మండలాల్లో వడగాల్పులు వీచాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. వడగాల్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2023, 07:43 PM IST
AP Weather Alerts: రాబోయే మూడు రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉండనుందంటే..?

AP Weather Alerts: రేపు గురువారం ఏపీలోని 15 మండలాల్లో, ఎల్లుండి 302 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. శుక్ర, శనివారం రెండురోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే  అవకాశం ఉందని హెచ్చరించిన ఆయన.. ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. 

బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.4°C, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.1°C, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో 43°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, 6 మండలాల్లో వడగాల్పులు వీచాయని వెల్లడించారు.

వడగాల్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు ఎవ్వరూ కూడా ఆశ్రయం కోసం చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Also Read: Telangana Formation Day Celebrations: 4 లక్షల కోట్లు ఇస్తే.. ఆ నలుగురే దోచుకున్నారు: బండి సంజయ్ ఫైర్

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న 15 మండలాలు జాబితా ఇలా ఉంది..

అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం మండలాలు ఉండగా.. కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని మండలాలు, విజయనగరం జిల్లాలో జామి, కొత్తవలస మండలాలు, విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలంలో వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉంది అని హెచ్చరించిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్.. రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎండ ప్రభావం అధికంగా ఉండే ప్రమాదం ఉంది అని సూచించారు.

Also Read: Eggs Pelted at Nara Lokesh: నారా లోకేష్‌పై గుడ్లతో దాడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News