AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా ప్రసంగించనున్న ఈ సమావేశాల్లో దాదాపు 20 బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ షెడ్యూల్ మరి కాసేపట్లో ఖరారు కానుంది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా ప్రత్యక్షంగా ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. తరువాత జరిగే బిజినెస్ ఎడ్వైజరీ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, శాసనసభ వ్యవహారాల మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బీఏసీ సమావేశంలో పాల్గొంటారు. బీఏసీ సమావేశం అనంతరం కేబినెట్ భేటీ జరగనుంది.
ఇక అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు జరగనున్నాయనేది బీఏసీ సమావేశంలో నిర్ధారిస్తారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు 20 బిల్లులు ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్ని వారం రోజులు కాకుండా ఈ నెల 26వ తేదీ వరకూ నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అసెంబ్లీ సమావేశాలు జరిగినా..కోవిడ్ కారణంగా ఎప్పుడూ ప్రత్యక్షంగా ప్రసంగించలేదు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఇప్పుడు తొలిసారిగా ప్రత్యక్షంగా ప్రసంగించనున్నారు.
టీడీపీ వ్యూహం ఇదే
ఈసారి సమావేశాలు చంద్రబాబు గైర్హాజరీలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు టీడీపీ సభ్యులు చంద్రబాబు ఇంటి నుంచి బయలుదేరి..ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన ద్వారా అసెంబ్లీకు చేరుకోనున్నారు. అమరావతి నిర్మాణం హైకోర్టు తీర్పు, వివేకానందరెడ్డి హత్య కేసు, పోలవరం ప్రాజెక్టు అంశం, ప్రత్యేక హోదా, నిరుద్యోగం వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది.
Also read: Deep Depression: అత్యంత అరుదైన వాయుగుండం, వేసవి ప్రారంభంలో ఇదే తొలిసారి, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook