Somu Veerraju: పోలవరం ప్రాజెక్ట్‌పై మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని వివాదస్పదం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై టీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారని..ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తే రాష్ట్ర విభజనను తెరపైకి తీసుకొస్తామన్నారు సోమువీర్రాజు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాల్సిందేనని స్పష్టం చేశారు. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మం జిల్లాలో కలిపారని..విభజన తర్వాత భద్రాచలం ఆలయం, 2 మండలాలు తెలంగాణను ఇచ్చారని సోమువీర్రాజు గుర్తు చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ద్వారా సాగర్‌కు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ సంకల్పించారని..ఇప్పుడు ఆ ప్రాంతాన్ని తెలంగాణకు ఇవ్వడం వల్ల రాయలసీమ నష్టపోతోందన్నారు.
రాష్ట్ర విభజనపై పూర్తి స్థాయిలో తమ పార్టీ అధ్యయనం చేసిందని గుర్తు చేశారు. పోలవరం విషయంలో సీఎం జగన్ తీరు సరిగా లేదని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు సోమువీర్రాజు.
Also read:EPFO: ఈపీఎఫ్‌ఓలో పెరుగుతున్న ఖాతాదారుల సంఖ్య..మేలో ఎంత మంది చేరారంటే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook