AP: తీరప్రాంత అభివృద్ధికి చర్యలు, 4 ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం ఇకపై అభివృద్ధికి నోచుకోనుంది. రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. మరో నాలుగు త్వరలో ప్రారంభం కానున్నాయి.

Last Updated : Nov 21, 2020, 01:07 PM IST
  • జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం, ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ పనులకు శంకుస్థాపన
  • త్వరలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు
  • ప్రతి నియోజకవర్గానికో ఆక్వాహబ్ నిర్మాణం
AP: తీరప్రాంత అభివృద్ధికి చర్యలు, 4 ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం ఇకపై అభివృద్ధికి నోచుకోనుంది. రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. మరో నాలుగు త్వరలో ప్రారంభం కానున్నాయి.

ఏపీ ( AP ) లో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, మత్స్యకారుల ఉన్నతి దిశగా ఏపీ ప్రభుత్వం ( Ap Government )చర్యలు తీసుకుంటోంది. ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్బంగా అంతర్జాతీయ మౌౌళిక సదుపాయాలతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.  తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు సీఎం వైఎస్‌ జగన్ ( Ap cm ys jagan )వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. మరో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనుల్ని త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో 974 కిలోమీటర్ల  తీరప్రాంతమున్నా..మత్స్యకారుల జీవితాల్లో కానీ..మత్స్యపరిశ్రమ గానీ సరైన రీతిలో అభివృద్ధి జరగలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అవసరమైన ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొనడం పాదయాత్ర ( Padayatra )లో గమనించానన్నారు. అందుకే తొలిదశలో 4 ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వాహబ్ లకు శంకుస్థాపన చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికొక ఆక్వాహబ్‌ నిర్మాణం చేపడతామని చెప్పారు. జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇక త్వరలో మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో 3 పోర్టుల నిర్మాణాన్ని చేపడతామని వైఎస్ జగన్ వెల్లడించారు. Also read: Devipriya: ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ దేవిప్రియ కన్నుమూత

Trending News