AP CM YS Jagan: పార్టీ నేతలకు జగన్ దిశా నిర్దేశం, ఎన్నికలెప్పుడో క్లారిటీ

AP CM YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయో కూడా చెప్పేశారు. వైసీపీ ప్రతినిధుల భేటీలో పాలన ఎలా ఉందో దిశా నిర్దేశం చేశారు. రానున్న కాలంలో ఏం చేయాలో సూచించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2023, 02:55 PM IST
AP CM YS Jagan: పార్టీ నేతలకు జగన్ దిశా నిర్దేశం, ఎన్నికలెప్పుడో క్లారిటీ

AP CM YS Jagan: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్డేడియంలో జరిగిన పార్టీ ప్రతినిధుల భేటీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. నాలుగన్నరేళ్ల ప్రభుత్వ పాలన తీరు, రానున్న ఆరు నెలల్లో ఎలా ఉండాలి. ఏం చేయాలనేది పార్టీ ప్రతినిధులకు వివరించారు. రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల్ని విశదీకరించారు. పార్డీ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. 

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల భేటీలో చాలా విషయాలపై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో న్యాయం చేసిందని, మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించామన్నారు. దేశ చరిత్రలో ఇలా చేసిన పార్టీ మరొకటకి లేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా, పేదల చెంతకు పరిపాలన తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. 

నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకూ రాష్ట్రంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మళ్లీ జగన్ ఎందుకు కావాలో చెప్పే కార్యక్రమం ఇదన్నారు. గ్రామస్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ చిత్తశుద్ధితో పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో ప్రజలకు జరిగిన మంచిని గుర్తు చేయాలన్నారు. ఇచ్చిన హామీల్ని ఎలా నిలబెట్టుకున్నామో ప్రజలకు వివరించాలన్నారు. 

రానున్న కాలంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి నిరంతరం నిర్వహించాలని వైఎస్ జగన్ కోరారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం వ్యాధులబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జననన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 65 లక్షల ఇళ్లను కవర్ చేస్తున్నట్టు జగన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షలమందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు. 22 లక్షలమందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. 

విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వైఎస్ జగన్ వివరించారు. నామినేటెడ్ పదవుల్లో  50 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయం పాటించామన్నారు. వైఎస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడనే విధంగా నిరూపించామన్నారు. రానున్న కాలంలో పార్టీకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు గుర్తు చేయడమే కాకుండా ఇక ముందు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. 

రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తాయని అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయో చెప్పడం ద్వారా ముందస్తు ఎన్నికల ప్రచారానికి మరోసారి తెర దించారు జగన్. 

Also read: Ap Skill Development Case: చంద్రబాబుకు భారీ షాక్‌..బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News