ఇకపై హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు

ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం నాడు అమరావతిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేటి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అన్నారు. 

Updated: Nov 2, 2019, 10:15 AM IST
ఇకపై హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు

అమరావతి: ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం నాడు అమరావతిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేటి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అన్నారు. 

ఏపీలోని ఆసుపత్రుల్లో అందుబాటులో లేని కొన్ని వైద్యసేవలను బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఉన్నందు వల్లే రోగులకు ఇబ్బందులు లేకుండా అక్కడ కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద వారికి అవసరమైన చికిత్స పొందేలా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం జగన్ తెలిపారు.