Polavaram project: పోలవరం పనులపై ముగిసిన కీలక సమీక్ష, ఎత్తు తగ్గింపుపై నిర్ణయం

Polavaram project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన సమీక్ష నిర్వహించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై వస్తున్న వార్తలపై చర్చ జరిగింది. నిజంగానే పోలవరం ఎత్తు తగ్గించనున్నారా లేదా..ఎత్తు తగ్గింపు విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2021, 06:52 PM IST
  • పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమీక్ష
  • పోలవరం ఎత్తుపై వస్తున్న వార్తలపై సమీక్షలో చర్చ
  • ఎత్తు తగ్గింపు లేనే లేదని స్పష్టం చేసిన అధికారులు
Polavaram project: పోలవరం పనులపై ముగిసిన కీలక సమీక్ష, ఎత్తు తగ్గింపుపై నిర్ణయం

Polavaram project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన సమీక్ష నిర్వహించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై వస్తున్న వార్తలపై చర్చ జరిగింది. నిజంగానే పోలవరం ఎత్తు తగ్గించనున్నారా లేదా..ఎత్తు తగ్గింపు విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( Ap cm ys jagan) పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష ( Polavaram project review) నిర్వహించారు. పోలవరం పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మే నెల చివరికి కాపర్ డ్యాం పనులు పూర్తి కావాలన్నారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్, ఎగువ కాపర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం, గేట్ల అమరిక వంటి కీలక పనులపై అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వ చేసిన తప్పిదాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. స్పిల్ వే( Polavaram spillway) పూర్తి కాకుండా కాపర్ డ్యాం ( Coper Dam)నిర్మాణం చేపట్టడం వల్ల..వరద సమయంలో సమస్య తలెత్తిందన్నారు. వరద సమయంలో సెకనుకు 13 మీటర్ల వేగంతో వరద ప్రవాహం వచ్చిందని అధికారులు తెలిపారు. దాంతో ఈసీఆర్ఎఫ్ డ్యాం వద్ద గ్యాప్ 1, గ్యాప్ 2లలో భారీగా కోత ఏర్పడిందని అధికారులు వివరించారు. అటు స్పిల్ వే పనులకు కూడా ఆటంకం కలిగిందన్నారు. ప్రస్తుతం స్పిల్ వే పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పారు. గేట్ల అమరిక, సిలిండర్ల బిగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. స్పిల్ వే ఛానెల్, అప్రోచ్ ఛానెల్ పనులు పూర్తయ్యేలోగా..కాపర్ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనుల్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మరోవైపు పోలవరం పునరావాస సహాయ కార్యక్రమాలపై సైతం సమీక్ష జరిగింది. 

పోలవరం ఎత్తు తగ్గింపు లేనేలేదు

సమీక్షలో ప్రధానంగా పోలవరం ఎత్తు ( Polavaram Dam Height) తగ్గింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ కథనాల ఆధారంగా జరుగుతున్న దుష్ప్రచారంపై సమావేశంలో చర్చకు వచ్చింది. అసలు అలాంటి అవకాశమే లేదని అధికారులు  స్పష్టంచేశారు. సీడబ్ల్యూసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. పోలవరం (Polavaram project )ఎత్తు తగ్గింపుపై ఇప్పుడు చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సెంట్రల్‌ వాటర్‌కమిషన్, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విస్పష్టంగా చెప్పాయన్నారు. ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగిన విధంగా షట్టర్ల బిగింపు పూర్తవుతోందని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. మరోవైపు పోలవరం జి హిల్ సైట్‌పై నిర్మించనున్న వంద అడుగుల వైఎస్సార్ విగ్రహం, వైఎస్సార్ గార్డెన్స్‌పై మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి జగన్( Ap cm ys jagan)‌కు అధికారులు వివరించారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ రూపొందించాలని జగన్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణం, ఆ బ్రిడ్జి నుంచి జి హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణాన్ని అధికారులు ప్రతిపాదించారు. 

Also read: SEC All party meet: భేటీ నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యను బయటకు పంపించేసిన నిమ్మగడ్డ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News