Ys jagan review: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిర్ధారిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ఆసుపత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona second wave) పెరుగుతున్నట్టే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన కల్గిస్తోంది. ఏపీలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కలుగుతోంది. కరోనా పంజా విసురుతుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష ( Ap cm ys jagan review) నిర్వహించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 4 వేల పైచిలుకు కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు.
ఏపీలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 6 లక్షల 4 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. ఇదే తరహాలో ఇదే వేగంతో వ్యాక్సినేషన్(Vaccination) కొనసాగించాలని అదికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అదనపు వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రాన్ని కోరాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్పై మరింతగా దృష్టి పెట్టాలన్నారు. ఏపీలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్స్‌పై ఆరా తీశారు. మరిన్ని బెడ్స్ అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు రెమిడెసివిర్ (Remdesivir) లభ్యతపై ఆరా తీశారు. ప్రైవేటు ఆసుపత్రులు ( Private Hospitals) ప్రజల్ని దోచుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ధారిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 108 కోవిడ్ ఆసుపత్రులున్నాయని..వాటిని 230కు పెంచాలని జగన్ ఆదేశించారు.
Also read: Vijayawada Railway station: అమ్మకానికి విజయవాడ రైల్వే స్టేషన్, 99 ఏళ్ల లీజుకు సిద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook