ఇప్పుడు గెలిస్తే మరో 30 ఏళ్లు మనదే అధికారం. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజా వ్యూహం. అందుకే టార్గెట్ 175 అంటున్నారు. టార్గెట్ 175 ఛేదించాలంటే కావల్సింది బీసీ ఓటింగ్. ఆ బీసీ ఓటింగ్ కోసం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న ఆయన మరో భారీ కార్యక్రమం తలపెట్టారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదట్నించీ బీసీ ఓటర్లపైనే కన్నేశారు. బీసీల కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీసీలకు పెద్దఎత్తున పదవులు కట్టబెడుతున్నారు. జనరల్ స్థానాల్ని కూడా బీసీలకే ఇస్తూ ప్రాధాన్యత చాటిచెబుతున్నారు. 2024 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర ముందు నుంచే ఎన్నికల వ్యూహాలకు పదునుబెడుతున్నారు. ఎన్నికల టీమ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి బీసీలపై ఫోకస్ పెట్టారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ స్డేడియంలో డిసెంబర్ 8న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీ,య సదస్సు ఏర్పాటుచేసింది. ఇప్పుడీ సమావేశాన్ని సీఎం వైఎస్ జగన్ ఒకరోజు ముందుకు జరిపారు. అంటే డిసెంబర్ 7న నిర్వహించనున్నారు. అంతేకాదు..జయహో బీసీ మహాసభగా నామకరణం చేశారు. ట్యాగ్‌లైన్ కూడా ఉంది ఈ సభకు. వెనుకబడిన కులాలే వెన్నెముక అని. ఈ సభకు గ్రామ పంచాయితీ సభ్యుల నుంచి మంత్రుల వరకూ అందరూ హాజరుకానున్నారు. దాదాపుగా 60-75 వేలమంది హాజరౌతారనేది ఓ అంచనా. రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎంపీలు వేదిక నుంచి మాట్లాడనున్నారు. అందరూ మాట్లాడిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.
Also read: BS 4 Vehicles Scam: బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్థుల సీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook