Ap cm ys jagan: ఏపీలో ఉద్యోగుల సమస్యలకు చెక్ పడింది. ఉద్యోగులకు చెందిన అంశాలపై కేబినెట్ నిర్ణయాలుకు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా..ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయి..కృతజ్ఞతలు తెలిపారు. అటు ముఖ్యమంత్రి జగన్ కూడా ఉద్యోగుల సహకారం కోరారు. ఉద్యోగుల ముఖంపై చిరునవ్వు ఉండాలన్నారు.
ఏపీలో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు, సీపీఎస్ రద్దుపై ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగుల సమ్మెకు తెరపడింది. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించింది. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ నిర్ణయాలకు ఏపీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులతో మాట్లాడారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే అంతా బాగుంటుందని ప్రజలకు సంతోషంగా ఉంటారని చెప్పారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచేందుకు చిత్తుశుద్దితో కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు ఉంటేనే బాగా పనిచేస్తారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మీ నుంచి భవిష్యత్‌లో సైతం జగన్ మంచి చేశాడనే మాటే రావాలి తప్ప, మరో మాట ఉండకూడదని జగన్ ఆకాంక్షించారు. ఉద్యోగులకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ఇంత సిన్సియర్‌గా పరిష్కారం వెదికిన పరిస్థితి రాష్ట్రంలో మరెక్కడా లేదన్నారు.
తానెప్పుడూ ఉద్యోగులకు మంచి చేయాలనే ఆలోచిస్తానని..రాజకీయ కారణాలతో ఎవరు ఏం చెప్పినా విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు జగన్. సీపీఎస్ రద్దు చేసి ఆ స్థానంలో జీపీఎస్ కోసం రెండేళ్లుగా కసరత్తు చేశామన్నారు. 2003లో ప్రభుత్వం ఇది అయ్యే పని కాదని చేతులెత్తేసింది. కానీ ఉద్యోగులు రోడ్డుపై పడకూడదనే ఉద్దేశ్యంతో, తీసుకునే జీతంలో 50 శాతం పెన్షన్‌గా వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో జీపీఎస్ దేశానికే రోల్ మోడల్ కానుందన్నారు.కేబినెట్‌లో ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమలు కావాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎక్కడా ఎలాంటి ఆలస్యం ఉండకూడదన్నారు.
Also read: Pawan Kalyan Varahi Yatra: రేపే వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం.. షెడ్యూల్ ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook