AP: దేశంలోనే తొలిసారిగా ఇంటింటి ఆరోగ్య సర్వే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సాధారణంగా ప్రజలు తరచూ ఇబ్బంది పడే లైఫ్ స్టైల్ జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ప్రాధమిక దశలోనే గుర్తించి వైద్యం అందించడం సర్వే ప్రధాన ఉద్దేశ్యం.

Last Updated : Oct 26, 2020, 09:07 PM IST
  • మధుమేహం, రక్తపోటు, కేన్సర్, కుష్టు వంటి లైఫ్ స్టైల్ రోగాల్ని గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఏపీలో సమగ్ర ఆరోగ్య సర్వే
  • ఇప్పటికే 19 శాతం సర్వే పూర్తి..మరో మూడు నెలల్లో పూర్తిగా సర్వే
  • ప్రాధమిక దశలోనే గుర్తించి..వైద్యం అందించడమే సర్వే లక్ష్యం
AP: దేశంలోనే తొలిసారిగా ఇంటింటి ఆరోగ్య సర్వే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra pradesh ) వైద్య, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సాధారణంగా ప్రజలు తరచూ ఇబ్బంది పడే లైఫ్ స్టైల్ జబ్బుల ( lifestyle diseases ) పై రాష్ట్ర ప్రభుత్వం ( Ap government ) ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ప్రాధమిక దశలోనే గుర్తించి వైద్యం అందించడం సర్వే ప్రధాన ఉద్దేశ్యం.

దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున సమగ్ర ఆరోగ్య సర్వే నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. లైఫ్ స్టైల్ జబ్బుల్ని అంటే మధుమేహం ( Diabetes ) , కుష్టు, బీపీ ( Blood pressure ) , క్యాన్సర్ ( Cancer ) వంటి వ్యాధుల్ని ప్రాధమిక దశలోనే గుర్తించి..చికిత్స అందించేందుకు వీలుగా వినూత్న సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 19 శాతం సర్వే పూర్తయింది. ఇప్పటికే 15 రోజులుగా దాదాపు 19 వేల మంది ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి వ్యాధి లక్షణాలను పరీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల 34 లక్షల మంది ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేయనున్నారు. మొత్తం సర్వే పూర్తవడానికి మరో మూడు నెలలు పట్టవచ్చని...దేశంలోనే ఇదే అతిపెద్ద సర్వే అంటున్నారు అధికారులు.

ఏపీ ( Ap ) లో ఇప్పటివరకూ 19.01 శాతం సర్వే పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో 19.43 శాతం పూర్తికాగా.. పట్టణ ప్రాంతాల్లో 17.27 శాతం పూర్తయింది. గ్లూకోమీటర్, హిమోగ్లోబిన్‌ మీటర్ల ద్వారా మధుమేహం, రక్తహీనతల్ని గుర్తిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీపీ బాధితులు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. మరీ ముఖ్యంగా 35 ఏళ్లలోపు వారికి సైతం మధుమేహం  లక్షణాలున్నట్టు తేలింది.

దీనికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలనూ ఇందులో నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు అందించే నివేదిక ఆధారంగా..వ్యాధి లక్షణాలున్నవారికి ఏ ఆస్పత్రిలో వైద్యం అందించాలి, ఎక్కడ మందులు ఇవ్వాలనేది నిర్ణయమవుతుంది. ప్రతి ఒక్కరికీ ఎంత ఖరీదైనా మందులైనా ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. Also read: AP: భారీగా తగ్గిన కరోనా కేసులు, తాజా కేసులు కేవలం 19 వందలే

Trending News