Covid Vaccination: ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది ప్రభుత్వం. ఇప్పటికే మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లతో రికార్డు సాధించిన ప్రభుత్వం..ఇప్పుడు మరోసారి డ్రైవ్ చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి గణనీయంగా తగ్గింది. రోజుకు 2 వేల 5 వందల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి తగ్గడంతో ఇప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 2 వేల 128 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 45 ఏళ్లు మించినవారు, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండవ విడత వ్యాక్సినేషన్ (Vaccination)ప్రక్రియ కొనసాగుతోంది.
Also read: Eluru Corporation Results: ఎన్నికల్లో భారీ విజయం, కోవిడ్‌తో మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook