Thalliki Vandanam: కొత్త ఏడాదిలో మరో కొత్త పధకం లాంచ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పధకంపై క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పధకాన్ని అమలు చేసి తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఏపీలో గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో బడికి వెళ్లే విద్యార్ధి తల్లికి ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ఏడాదికి 15 వేల చొప్పున అందిస్తూ వచ్చింది. ఆ తరువాత 2024 ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు అదే పధకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చారు. ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలుంటే అంతమందికి 15 వేలు చొప్పున తల్లి ఎక్కౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుుడు చేసిన ప్రచారం నీకు 15 వేలు నీకు 15 వేలు బాగా పాపులర్ అయింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయినా ఇంకా తల్లికి వందనం పధకంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడెప్పుడు ప్రారంభం కానుందా అని తల్లులంతా ఎదురుచూసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పధకంపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో తల్లికి వందనం పధకంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. చివరికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన విధి విదానాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. ఎన్నికల సమయంలో అయితే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు త్వరలో ఖరారు కానున్న విధి విధానాల్లో ఎలాంటి స్పష్టత ఉంటుందో తేలాల్సి ఉంది
Also read: SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఎస్బీఐలో 14 వేల ఉద్యోగాల భర్తీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.