Covid19 War: అగ్రస్థానంలో ఏపీ ప్రభుత్వం

కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) పై జరుగుతున్న పోరులో ఎవరిది పై చేయి అనేది పరిశీలిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైెఎస్ జగన్ ( ys jagan government ) ప్రభుత్వమే అనేది కొంతమంది వాదన. గణాంకాలు పరిశీలించినా..తీసుకుంటున్న చర్యలు చూస్తున్నా అదే అనిపిస్తోంది. బహుశా అందుకే ప్రధాని మోదీ ( pm modi )సైతం జగన్‌ను ప్రశంసించారు.

Last Updated : Jul 20, 2020, 01:00 PM IST
Covid19 War: అగ్రస్థానంలో ఏపీ ప్రభుత్వం

కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) పై జరుగుతున్న పోరులో ఎవరిది పై చేయి అనేది పరిశీలిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైెఎస్ జగన్ ( ys jagan government ) ప్రభుత్వమే అనేది కొందరి వాదన. గణాంకాలు పరిశీలించినా..తీసుకుంటున్న చర్యలు చూస్తున్నా అదే అనిపిస్తోంది. బహుశా అందుకే ప్రధాని మోదీ ( pm modi )సైతం జగన్‌ను ప్రశంసించారు.

కోవిడ్ 19 వైరస్ దేశవ్యాప్తగా విజృంభిస్తుంది. కరోనా వైరస్ కమ్యూనిటీ దశకు ( Covid 19 virus on community stage ) చేరుకుందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాకపోయినా పరిస్థితులు చూస్తుంటే అలాగే అన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చేయాల్సింది ఒక్కటే. కరోనా కట్టడికి  పగడ్భంధీ చర్యలు తీసుకోవడం, నిర్ధారణ పరీక్షల్ని పెంచుకుంటూ పోయి కంటెయిన్మెంట్ జోన్ల సంఖ్యను పెంచడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation ) గానీ, ఐసీఎంఆర్ ( ICMR ) గానీ ఇదే చెబుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ ప్రభుత్వం ( Ys jagan Government ) మొదట్నించీ ఇదే ఆలోచనలో ఉంది. కోవిడ్ 19 వైరస్ పై పోరులో భాగంగా దేశంలోనే అత్యధిక కోవిడ్ 19 పరీక్షలు ( Covid 19 Tests ) చేస్తున్న రాష్ట్రంగా పేరుగాంచింది. ఇంటింటా పరీక్షల్లో భాగంగా సంజీవిని, ఐమాస్క్ బస్సుల్ని ( Sanjivini and IMasq buses ) తిప్పుతోంది. ప్రతిరోజూ దాదాపు 30 వేల పరీక్షలు జరుగుతున్నాయి ఏపీలో. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 13న్నర లక్షలు దాటింది. శాశ్వత కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షా కేంద్రాల్ని సైతం ఏర్పాటు చేస్తోంది. Also read: ఏపీలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారా?

కరోనా వైరస్ ( Corona virus ) ను ఇప్పటికే ఆరోగ్య శ్రీ ( Arogya Sri ) పరిధిలో తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా 15 వందల బెడ్స్‌తో భారీగా కోవిడ్ కేర్ సెంటర్ ( Largest covid care centre ) ను నిర్మిస్తోంది. అనంతపురం జిల్లాలోని పౌర సరఫరాల సంస్థ గోడౌన్ ను దీనికోసం ఎంచుకుంది. 12 బ్లాక్ లలో, 15 వందల బెడ్స్‌తో ఇది ఏర్పాటవుతోంది. రోగుల కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ 180, 2 క్లినికల్ ల్యాబరేటరీల్ని ఇదే సెంటర్ లో ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాట్లు సాగుతుండటం విశేషం. ఇదే సెంటర్ లో ఈసీజీ, ఎక్స్ రే సదుపాయాల్ని కల్పిస్తున్నారు. Also read: AP: గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ రమేశ్: ఏం జరగబోతోంది?

అన్ని విధాలుగానూ ఆలోచన చేస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అందుకే ప్రధాని మోదీ ( Pm modi congratulates jagan )సైతం కోవిడ్ 19 వైరస్ పై తీసుకుంటున్న చర్యల్ని తెలుసుకుని ఏపీ సీఎం జగన్ ను ప్రశంసించారు. Also read: Corona effect: శ్రీహరికోటలో లాక్‌డౌన్

Trending News