AP: పీపీఈ కిట్ ధరించి కరోనా వార్డుల్లో మంత్రి ఆళ్ల నాని

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ( Ap Health minister ) కోవిడ్ ఆసుపత్రుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు సేవలు సరిగ్గా అందుతున్నాయా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) ఆదేశాల మేరకు స్వయంగా ఆసుపత్రిలోని కరోనా వార్డుల్ని పరిశీలించారు మంత్రి ఆళ్ల నాని.

Last Updated : Aug 6, 2020, 03:44 PM IST
AP: పీపీఈ కిట్ ధరించి కరోనా వార్డుల్లో మంత్రి ఆళ్ల నాని

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ( Ap Health minister ) కోవిడ్ ఆసుపత్రుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు సేవలు సరిగ్గా అందుతున్నాయా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) ఆదేశాల మేరకు స్వయంగా ఆసుపత్రిలోని కరోనా వార్డుల్ని పరిశీలించారు మంత్రి ఆళ్ల నాని.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ( Minister Alla nani ) స్వయంగా పీపీఈ కిట్ ( PPE kits ) ధరించి మరీ..కోవిడ్ రోగులున్న వార్డుల్ని పరిశీలించారు. కరోనా రోగులతో మాట్లాడారు. కోవిడ్ రోగులకు ( Covid patients ) అందుతున్న భోజనం గానీ, శానిటేషన్ గానీ, మంచినీరు గానీ ఎలా ఉన్నాయో స్వయంగా అడిగారు.  కోవిడ్ ఆసుపత్రుల్లో( Covid hospitals ) అందుతున్న సేవలపై నేరుగా అడిగి తెలుసుకోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. క్వారెంటైన్ కేంద్రాల్లో ప్రతి రోగికి రోజుకు 5 వందల రూపాయల్ని భోజనం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. నెలకు 350 కోట్లను కరోనా బాధితుల కోసం కేటాయించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోజుకు దాదాపు 50 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. Also read: AP: మూడు రాజధానుల అంశంపై కేంద్రం వైఖరి ఇదే

Trending News