AP movie tickets : ఏపీలో మూవీ టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు, తీర్పు ఇచ్చిన హైకోర్టు

AP High Court suspends GO of movie ticket prices: ఏపీలో పాత విధానంలోనే సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించేందుకు వెసులుబాటును కల్పిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 35 ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలుపుతూ తీర్పు ఇచ్చింది. పాత పద్ధతిలోనే టిక్కెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు థియేటర్ల యజమానులకు కల్పించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 07:30 PM IST
  • సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన
    జీవోను కొట్టి వేసిన హైకోర్టు
  • పాత విధానంలోనే సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించేందుకు వెసులుబాటు
AP movie tickets : ఏపీలో మూవీ టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు, తీర్పు ఇచ్చిన హైకోర్టు

AP High Court suspends GO over the reduction of movie ticket prices: సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 35ను హైకోర్టు కొట్టివేసింది. పాత విధానంలోనే సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించేందుకు వెసులుబాటును కల్పిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

అయితే ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లను విషయంలో జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు సినిమా థియేటర్ల యజమానులు (Owners of movie theaters) హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపుపై కోర్టు ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్లు (Petitioners) పేర్కొన్నారు. కొత్త మూవీలకు రేట్లు పెంచుకునే హక్కు సినిమా థియేటర్‌ యజమానులకు ఉంటుందని కోర్టుకు (High Court) తెలిపారు. 

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్‌ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై మంగళవారం హైకోర్టులో (AP High Court)  వాదనలు జరిగాయి. 

Also Read :Viral Video: బాక్సింగ్ రింగ్‌లో ఇద్దరు పొలిటిషియన్లు తలబడితే ఎలా ఉంటుంది-ఇదిగో ఇలా

అలాగే సినిమా టిక్కెట్ల రేట్లను (Movie ticket rates) తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ల పలు వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 35 ను (GO No. 35) సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలుపుతూ తీర్పు ఇచ్చింది. అలాగే పాత పద్ధతిలోనే టిక్కెట్ల రేట్లను (ticket rates) నిర్ణయించుకునే వెసులుబాటు థియేటర్ల యజమానులకు కల్పించింది. 

Also Read :BheemlaNayak : భీమ్లా నాయక్ నుంచి క్రేజీ అప్‌డేట్.. రానా డైలాగ్‌లు చింపేశాడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News