Mekapati Goutam Reddy Death Reasons: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అందర్నీ కలచివేస్తోంది. ఎప్పుడూ ఎవర్ ఫిట్‌గా ఉండే గౌతమ్ రెడ్డి గుండెపోటుకు కారణం..పోస్ట్ కోవిడ్ అనే అనుమానాలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణవార్త రాష్ట్ర ప్రజల్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. ఏపీ ప్రభుత్వం తరపున దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి నిన్ననే తిరిగొచ్చారు. ఒక్కసారిగా ఆయన లేరనే వార్తను ప్రజలు, కార్తకర్తలు, నేతలు, సహచర మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. శారీరకంగా ధృడంగా ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి అంతలా ఒక్కసారిగా గుండెపోటుకు గురవడం అందర్నీ నిర్ఘాంతపరుస్తోంది.
తన రాజకీయ వారసుడిగా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి..గౌతమ్ రెడ్డిని తీసుకొచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే..పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలకమైన ఎంఓయూలను కుదుర్చుకున్నారు. దుబాయ్ నుంచి తిరిగి రాగానే..గుండెపోటుకు గురయ్యారు., వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. వైద్యులకు పల్స్ అందకపోవడం, శ్వాసకు ఇబ్బంది రావడంతో వైద్యులు చాలారకాలుగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. శరీరం చికిత్సకు సహకరించలేకపోయింది. చివరికి మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
వాస్తవానికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎప్పుడూ ఎవర్ ఫిట్‌గా ఉంటారు. వయస్సు 49 ఏళ్లైనా..అలా కన్పించరు. ఆరోగ్యంగా ఉంటారెప్పుడూ. చాలా చలాకీగా తిరుగుతారు. రోజూ జిమ్ చేసే అలవాటుండటంతో శారీరకంగా ధృడంగా ఉంటారు. ఫిట్ అండ్ ఫైన్‌గా ఉండే ఇలాంటి వ్యక్తికి సింగిల్ స్ట్రోక్‌లో గుండెపోటు రావడం, ప్రాణాలు వదిలేయడమంటే జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఎవర్ ఫిట్ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వెనుక
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడానికి కారణం పోస్ట్ కోవిడ్ కావచ్చని తెలుస్తోంది. వైద్యులు ఈ అంశంపై ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ ఇటీవలే ఆయన కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాల్లో గుండెపోటు , శ్వాస అందకపోవడం ప్రధానంగా కన్పిస్తున్నాయని ఇప్పటికే వైద్యులు పలు సందర్భాల్లో వెల్లడించారు. పోస్ట్ కోవిడ్ అనారోగ్య పరిణామాలు.. గుండెపోటుకు కారణమని వైద్యులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా చాలామందికి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉండిపోవడం, రక్తనాళాల్ని బ్లాక్ చేసి గుండెపోటుకు దారి తీయడమనేది జరుగుతోంది. ఇదే ఇప్పుడు మంత్రి గౌతమ్ రెడ్డి విషయంలో జరిగి ఉండవచ్చని అంచనా.
Also read: Goutam Reddy Death: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై మంత్రుల దిగ్భ్రాంతి, సంతాపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook