Mekapati Goutham Reddy: మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి కుటుంబం, చదువు, రాజకీయ జీవితం!

Mekapati Goutham Reddy: ఎపీ ఐటీ, పరిశ్రమల మంత్రి గౌతమ్​ రెడ్డి సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు చూద్దాం!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 10:35 AM IST
  • గుండె పోటుతో ఏపీ మంత్రి మృతి
  • ఇటీవలే కొవిడ్ బారిన పడిన గౌతమ్​ రెడ్డి
  • కుటుంబ సభ్యులతో పాటు ఏపీ ప్రజలకు తీరని లోటు..!
Mekapati Goutham Reddy: మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి కుటుంబం, చదువు, రాజకీయ జీవితం!

Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్​ మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి ఇవాళ ఉదయం.. హైదరాబాద్​లో మృతి చెందారు. గుండె పోటు కారణంగా జూబ్లీహిల్స్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. గత నెలలో ఆయన కరోనా బారిన పడి.. కోలుకోవడం గమనార్హం. కొవిడ్ సోకడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి ఆయన మృతికి దారి తీసిందా అనే విషయం తెలియాల్సి ఉంది. మంత్రి గౌతమ్​ రెడ్డి వయసు 50 సంవత్సరాలు. చిన్న వయసులోనే గౌతమ్​ రెడ్డి గుండె పోటుతో మృతి చెందటం పట్ల తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలిలో ఆయన ఐటీ, పరిశ్రమలు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గౌతమ్​ రెడ్డి. ఇందులో భాగంగా..దుబాయ్​లో జరగుతున్న ఎక్స్​పో 2020లో పాల్గొన్నారాయన. ఎక్స్​పోలో వరుస భేటీలు ముగించుకుని.. ఆదివారమే తిరిగి హైదరాబాద్​కు చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయమే ఆయనకు ఇలా జరగటం కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది.

గౌతమ్​ రెడ్డి వ్యక్తిగత జీవితం..

గౌతమ్​ రెడ్డి 1971 నవంబర్​ 2న జన్మించారు. వ్యాపార, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో జన్మించారాయన. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజామోహన్ రెడ్డి ముగ్గురు సంతానంలో.. గౌతమ్​ రెడ్డి ఒకరు.

గౌతమ్​ రెడ్డికి భార్యా (మేకపాటి శ్రీ కీర్తి), ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గ్రాడ్యుయేషన్​ వరకు హైదరాబాద్​లో చదువుకున్న గౌతమ్​ రెడ్డి.. ఆ తర్వాత ఎంఎస్​ కోసం యూకే వెళ్లారు. అక్కడ యూనివర్సిటి ఆఫ్​ మాంచెస్టర్​లో ఎంఎస్​ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇండియా తిరిగి వచ్చి.. ఇక్కడ వ్యాపార జీవితం ప్రారంభించారు.

వ్యాపారంలో రాణిస్తూనే తండ్రి అడుగుజాడల్లో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో వైఎస్​ఆర్​ కాంగ్రెస్ పార్టీలో చేరి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే ఆయన విజయం సాధించారు. ఇక రెండో సారి 2019లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. విజయకేతనం ఎగురవేశారు. ఇక ఆ ఏటా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో.. గౌతమ్​ రెడ్డికి మంత్రి పదవి లభించింది. వైసీపీతో పాటు ఏపీలో కీలక రాజకీయనేతగా గౌతమ్​ రెడ్డి గుర్తింపు సంపాదించారు.

Also read: Breaking News: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

Also read: Mekapati Goutham Reddy Death: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై మంత్రుల దిగ్భ్రాంతి, సంతాపం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News