AP New Districts: ఈ ఏడాది ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. 13 జిల్లాల రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా జగన్ సర్కార్ మార్చింది. ఆ తర్వాత మంత్రి మండలిలోనూ మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
దీంతో ఏపీలోని ప్రతి పౌరుని ఆధార్ కార్డులో జిల్లాల పేర్లను మార్చడం అనివార్యంగా మారింది. అయితే పాత జిల్లాల పేర్ల స్థానంలో కొత్త జిల్లాల పేర్లను చేర్చే విషయంపై అధీకృత సంస్థతో మాట్లాడుతున్నామని ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ కార్యదర్శి బాబు వెల్లడించారు. ఇదే విషయమై మంగళవారం సమావేశం నిర్వహించినట్లు అతడు తెలిపారు. దీంతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు బాబు స్పష్టం చేశారు.
ఏపీలోని ప్రతి పౌరుని ఆధార్ కార్డులో మండలం, పిన్ కోడ్ మ్యాపింగ్ చేసి.. వాటితో ఆధార్ లో మార్పులు చేస్తే కొత్త జిల్లాల పేర్లు మారేలా చేయవచ్చని సీసీఎల్ఏ కార్యదర్శి బాబు తెలిపారు. దీన్ని అమలు చేసిన తర్వాత ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి సరిదిద్దవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే తెలంగాణలోనూ కొత్త జిల్లాలు అమలులో చేసిన క్రమంలో ఇలాంటి సమస్యే అక్కడా తలెత్తినట్లు తెలుస్తోంది.
Also Read: Stampede in Tirumala: తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు.. తొక్కిసలాటలో భక్తులకు గాయాలు..
Also Read: Pawan Kalyan News: అనంతపురంలో 'కౌలు రైతు భరోసా యాత్ర'.. రైతు కుటుంబాలను పవన్ ఆర్థిక సాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP New Districts: ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లు వచ్చేది అప్పటి నుంచే!