కేంద్ర బడ్జెట్‌పై వేల కోట్ల ఆశలు పెట్టుకున్న ఏపీ

కేంద్రం గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే పలు డిమాండ్ల సాధనకై కేంద్రానికి ఇచ్చిన వినతులు ఎంతవరకు ఫలిస్తాయో కాసేపట్లో తేలిపోనుంది. 

Last Updated : Feb 1, 2018, 01:34 PM IST
    • రాజధానికి వెయ్యి కోట్లు
    • లోటు నిధులకు నాలుగువేల కోట్లు
    • అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం, రోడ్లు, కోస్టల్ కారిడార్ లకు నిధులు
కేంద్ర బడ్జెట్‌పై వేల కోట్ల ఆశలు పెట్టుకున్న ఏపీ

కేంద్రం గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే పలు డిమాండ్ల సాధనకై కేంద్రానికి ఇచ్చిన వినతులు ఎంతవరకు ఫలిస్తాయో కాసేపట్లో తేలిపోనుంది. కొన్ని నిధులు అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే వచ్చే పరిస్థితి ఉండగా, విభజన అనంతరం అదనంగా రావాల్సిన నిధులపైనే అధికంగా ఆశలు పెట్టుకుంది. ఈ బడ్జెట్ లో రాష్ట్రాన్ని 'ప్రత్యేకం'గా చూడాలంటూ చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడల్లా కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. 

రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేంద్రం ఇస్తామన్న నిధులు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని ఆరోపిస్తుంది ఏపీ ప్రభుత్వం. తాజా బడ్జెట్‌ లో ఈసారి ఎలాగైనా అదనపు కేటాయింపులు దక్కించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బడ్జెట్ పైనే రాష్ట్రంలో టిడీపీ-బిజేపీ కూటమి బంధాలు నెలకొన్నాయి. చంద్రబాబు కూడా గడిచిన కొద్ది మాసాలుగా కేంద్రంపై ఒకింత అసహనంతో ఉన్నారు. ఈసారి రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులు, ప్రాజెక్టులు రాకుంటే కేంద్రంతో తాడోపేడో తెల్చుకొనేందుకు సిద్దమైనట్లు చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. 2019లో చంద్రబాబు ఒంటరిగానే వెళ్తానని సంకేతాలు కూడా అందించారు.  
   
2014-15 సంవత్సరానికి 16 వేల కోట్లరూపాయల లోటు ఉందని, అలాగే ఉద్యోగుల పీఆర్సీ కోసం రూ.5325 కోట్లు ఇవ్వాలని కోరుతుండగా కేంద్రం కేవలం రూ. 4,117 కోట్లు ఇస్తానని చెబుతోంది. కేంద్రం చెబుతున్న మొత్తాన్నయినా బడ్జెట్‌ లో పొందుపరచాలని రాష్ట్ర ఆర్థికశాఖ కోరుతోంది.

కాగా, రాజధాని నిర్మాణానికి సంబంధించి తాజా బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించాలని చంద్రబాబు సర్కార్ కోరింది. దీనికి అదనంగా అమరావతి నుంచి అన్ని ప్రాంతాలకు రోడ్డు రవాణా సౌకర్యం, విశాఖ-అమరావతిని కలుపుతూ చెన్నై వరకు హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మించాలని కోరింది. వైజాగ్ ను రైల్వే జోన్ గా ఈ బడ్జెట్ లో నైనా ప్రకటించాలని టిడిపీతో పాటు బిజేపీ నాయకులు కూడా కేంద్రాన్ని కోరారు. 

కొత్త రాష్ట్రంలో పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు కేటాయించాలని రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వాలని.. మిషనరీ వంటి వాటిపై 15 శాతం పెట్టుబడి వ్యయంపై సబ్సిడీ ఇవ్వాలని కోరింది. 

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ ఏడాది బడ్జెట్ లో ఏపీకి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్‌గా భరించిన 1200 కోట్ల రూపాయలను బడ్జెట్‌ ద్వారా విడుదల చేయాలని కోరుతున్నారు. అలాగే గన్నవరాన్ని అరతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు చేయడం, ఇతర విమానాశ్రయాల్లో విస్తరణ పనులు, విశాఖ నురచి చెన్నై వరకు కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణం, కేంద్రం ప్రకటించిన జాతీయ విశ్వవిద్యాలయాల ప్రారంభం (ఏఐఐఎంఎస్, నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ మొదలైనవి)  వంటి వాటికి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం 2019 లోపు పూర్తి చేయాలని రాష్ట్రం భావిస్తోంది. దీనికి కూడా బడ్జెట్ లో అనుకున్నంత నిధులు కేటాయించాలని కోరింది. 

Trending News