AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పట్టింది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఏపీలో కరోనా సంక్రమణ (Corona spread) నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కరోనా సంక్రమణ రేటు తగ్గుతోంది. రికవరీ రేటు పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 87 వేల 756 కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేయగా..కేవలం 4 వేల 549 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 59 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10 వేల 114 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల 13 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 860 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు తూర్పు గోదావరి జిల్లాలో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత 24 గంటల్లో ఈ జిల్లాలో 619 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 529, కడపలో 412 కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఏపీలో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్ని మాత్రం ఏపీ ప్రభుత్వం(Ap government)పెద్దఎత్తున చేపడుతోంది.
Also read: MANSAS TRUST: మాన్సాస్ ట్రస్టు కేసులో హైకోర్టు కీలక తీర్పు, ఛైర్మన్‌గా తిరిగి అశోక్ గజపతిరాజు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook