AP Corona Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఏపీలో గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది. రోజుకు లక్ష వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా..కేసుల సంఖ్య మాత్రం స్థిరంగానే కొనసాగడం విశేషం. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 1 లక్షా 1 వేయి 544 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..6 వేల 617 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. అదే సమయంలో 57 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 12 వేల 109కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 లక్షల 26 వేల 751 మందికి కరోనా వైరస్ సోకగా..17 లక్షల 43 వేల 176 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 71 వేల 466 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో 2 కోట్ల 7 లక్షల 36 వేల 435 మందికి కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు.
గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1397, అత్యల్పంగా కర్నూలులో 217 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జూన్ 20 తరువాత కర్ఫ్యూలో సడలింపులుంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కోవిడ్ పరిస్థితులపై ఆయన ఇవాళ స్పందన సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహంర మంచి ఫలితాలనిచ్చిందని వైఎస్ జగన్ చెప్పారు.
Also read: YS Jagan: కోవిడ్19 పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష, జూన్ 20 తరువాత సడలింపులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook