AP: అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ప్రారంభం

కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి కారణంగా మూతపడిన కళాశాలల్ని తిరిగి తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం ( Ap government ) నిర్ణయించింది. రాష్ట్రంలోని ఉన్న విద్యావిధానంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. దాంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Last Updated : Aug 6, 2020, 05:18 PM IST
AP: అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ప్రారంభం

కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి కారణంగా మూతపడిన కళాశాలల్ని తిరిగి తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం ( Ap government ) నిర్ణయించింది. రాష్ట్రంలోని ఉన్న విద్యావిధానంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. దాంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని ఉన్నత విద్యా విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) అధికార్లతో సమీక్షించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాడు నేడు కార్యక్రమాన్ని( Naadu nedu program ) కాలేజీలకు కూడా వర్తింపచేయాలని ఆదేశించారు. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. తెలుగు, సంస్కృతం అడాడమీల ( Telugu & Sanskrit Academy ) ప్రారంభానికి సీఎం ఆమోదముద్ర వేశారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్సీటీల స్థాపనకు చర్యలు తీసుకోవాలని అధికార్లను కోరారు. ముఖ్యంగా పాడేరులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు అంగీకరించారు. ముూడు నాలుగేళ్లల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. 

ఇక అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ( Colleges from october 15 ) తెరవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. సెప్టెంబర్ లో సెట్ ల నిర్వహణ పూర్తి కావాలని నిర్ణయించారు. కళాశాలలు తెరిచిన వెంటనే విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని అధికార్లను కోరారు. Also read: AP: పీపీఈ కిట్ ధరించి కరోనా వార్డుల్లో మంత్రి ఆళ్ల నాని

Trending News